ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sam Curran: ఎక్కువ డబ్బు పెట్టారు కదా అని.. శామ్ కరన్ కీలక వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-04-09T15:59:22+05:30

గతేడాది టీ20 ప్రపంచకప్‌లో అదరగొట్టిన ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ శామ్ కరన్‌(Sam Curran)ను ఐపీఎల్ ప్రాంఛైజీ పంజాబ్ కింగ్స్(Punjab Kings) ఏకంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ: గతేడాది టీ20 ప్రపంచకప్‌లో అదరగొట్టిన ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ శామ్ కరన్‌(Sam Curran)ను ఐపీఎల్ ప్రాంఛైజీ పంజాబ్ కింగ్స్(Punjab Kings) ఏకంగా రూ. 18.50 కోట్లు పోసి సొంతం చేసుకుంది. ఫలితంగా ఐపీఎల్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. తాజాగా ‘స్కై స్పోర్ట్స్’తో కరన్ మాట్లాడుతూ.. తనను ఎక్కువ డబ్బులకు కొనుగోలు చేశారు కదా అని తనపై తాను ఎక్కువ ఒత్తిడి వేసుకోబోనని తేల్చి చెప్పేశాడు.

తనపై తాను మరీ ఒత్తిడి పెట్టుకోబోనని స్పష్టం చేసిన కరన్.. తన దృష్టంతా ఆట మీదే ఉంటుందని చెప్పాడు. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్టు కరన్ కోసం పోటీ పడినప్పటికీ చివరికి పంజాబ్ కింగ్స్ అతడిని దక్కించుకుంది.

వారు(Punjab Kings) తనపై నమ్మకం ఉంచారని తాను అనుకుంటున్నానని కరన్ పేర్కొన్నాడు. వారు తనపై అంత డబ్బు వెచ్చించారని తనపై తాను అతిగా ఒత్తిడి పెట్టుకోబోనని, తాను బ్యాట్, బంతిపైనే దృష్టి సారిస్తానని పేర్కొన్నాడు. తన ధర ట్యాగ్ ఏమిటనేది పక్కనపెడితే తాను కొన్నిమ్యాచ్‌లు అద్భుతంగా ఆడుతానని ఆశాభావం వ్యక్తం చేశాడు.

పంజాబ్ కింగ్స్ అదృష్టాన్ని మార్చగలనన్న శామ్ కరన్.. ఈ సీజన్‌లో జట్టు తొలి టైటిల్ అందుకునేందుకు సాయం చేస్తానన్నాడు. ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్ రెండు వరుస విజయాలు సాధించి ఉత్సాహంగా ఉంది. కోల‌్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్‌పై ఆ జట్టు విజయాలు అందుకుంది.

టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించిన ఇంగ్లండ్ కప్పును కైవసం చేసుకుంది. ఈ టోర్నీలో కరన్ 13 వికెట్లు తీసుకుని ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు అందుకున్నాడు.

Updated Date - 2023-04-09T15:59:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising