ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IPL 2023: మేయర్స్ మెరుపు ఇన్నింగ్స్.. లక్నో భారీ స్కోరు

ABN, First Publish Date - 2023-04-01T21:36:44+05:30

ఐపీఎల్‌(IPL 2023)లో మరో భారీ స్కోరు నమోదైంది. ఢిల్లీ కేపిటల్స్‌(Delhi Capitals)తో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

లక్నో: ఐపీఎల్‌(IPL 2023)లో మరో భారీ స్కోరు నమోదైంది. ఢిల్లీ కేపిటల్స్‌(Delhi Capitals)తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ కైల్ మేయర్స్(Kyle Mayers) క్రీజులో ఉన్నంత సేపు విధ్వంసం సృష్టించాడు. సిక్సర్లతో చెలరేగాడు. ఫలితంగా స్కోరు అలుపు లేకుండా పరుగులు తీసింది. 38 బంతులు మాత్రమే ఆడిన మేయర్ 2 ఫోర్లు, 7 సిక్సర్లతో ఏకంగా 73 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో సెంచరీ దిశగా సాగుతున్న మేయర్స్‌ను అక్షర్ పటేల్(Axar Patel) బౌల్డ్ చేయడంతో ఢిల్లీ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు, అతడి జోరు చూసి సెంచరీ చేస్తాడనుకున్న లక్నో అభిమానులకు నిరాశ మిగిలింది.

అప్పటి వరకు పరుగులు తీసిన స్కోరు మేయర్స్ అవుటైన తర్వాత నెమ్మదించింది. క్రీజులోకి వచ్చినవారు వచ్చినట్టే వెనుదిరిగారు. అయితే, నికోలస్ పూరన్ మాత్రం కాసేపు క్రీజులో కుదురుకుని పరుగుల వేగాన్ని పెంచాడు. 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 36 పరుగులు చేశాడు. మేయర్స్ తర్వాత పూరన్ చేసిన 36 పరుగులే రెండో అత్యధికం. చివర్లో ఆయుష్ బదోని 7 బంతుల్లో రెండు సిక్సర్లు, ఫోర్‌తో 18 పరుగులు పిండుకోవడంతో జట్టు స్కోరు 193 పరుగుల వద్ద ఆగింది. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, చేతన్ సకారియా చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

Updated Date - 2023-04-01T21:36:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising