ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ICC: ఆన్‌లైన్ స్కామ్‌లో చిక్కుకుని ఐసీసీ విలవిల.. మిలియన్ డాలర్లు మాయం!

ABN, First Publish Date - 2023-01-21T18:14:01+05:30

ఇటీవలి కాలంలో ఆన్‌లైన్ మోసాలు మితిమీరుతున్నాయి. వ్యక్తులు, సంస్థలను లక్ష్యంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబాయ్: ఇటీవలి కాలంలో ఆన్‌లైన్ మోసాలు మితిమీరుతున్నాయి. వ్యక్తులు, సంస్థలను లక్ష్యంగా చేసుకుంటున్న ఆన్‌లైన్ నేరగాళ్లు లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారు. తాజాగా, ఇంటర్నేషనల్ క్రికెట్ కంట్రోల్ (ICC) కూడా ఆన్‌లైన్ స్కాంలో చిక్కుకుని కోట్ల రూపాయలు నష్టపోయింది. గతేడాది జరిగినట్టుగా చెబుతున్న ఈ విషయాన్ని తాజాగా ‘ఈఎస్‌పీఎన్ క్రిక్ ఇన్ఫో’ (ESPNCricinfo) బయటపెట్టింది. నేరగాళ్లు యూఎస్ఏ నుంచి ఈ మోసానికి పాల్పడినట్టు పేర్కొంది. ఇ-మెయిల్ అకౌంట్ కాంప్రమైజ్‌గా పిలిచే బిజినెస్ ఇ-మెయిల్ కాంప్రమైజ్ (BEC)తో నేరగాళ్లు ఈ ఆర్థిక కుంభకోణానికి పాల్పడ్డారు. అమెరికా ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ (FBI) దీనిని ఆర్థికంగా నష్టపరిచే ఆన్‌లైన్ నేరాలలో ఒకటిగా పేర్కొంది.

అయితే, ఇంత పెద్ద కుంభకోణం ఎలా జరిగిందనే విషయం తెలియరాలేదు. ఐసీసీ బ్యాంకు ఖాతా నుంచి డబ్బును బదిలీ చేసేందుకు ఎలాంటి మార్గాన్ని ఎంచుకున్నారనే దానిపై స్పష్టత లేదు. దుబాయ్‌లోని ఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఎవరితోనైనా నేరుగా సంప్రదించారా? లేదంటే ఐసీసీ వెండర్ లేదా కన్సల్టెంట్‌ను లక్ష్యంగా చేసుకున్నారా? అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. అలాగే, ఈ మొత్తం డబ్బు ఒకేసారి బదిలీ అయిందా? లేదంటే పలుమార్లు దీనిని బదిలీ చేసుకున్నారా? అనే విషయంలోనూ స్పష్టత లేదు.

Updated Date - 2023-01-21T18:19:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising