చచ్చీ చెడి.. సెమీస్‌కు
ABN, First Publish Date - 2023-10-04T04:35:17+05:30
ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు సెమీఫైనల్ చేరింది. మంగళవారం నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని భారత్ 23 పరుగుల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది.
23 పరుగులతో నేపాల్‌పై భారత్ గెలుపు
యశస్వి జైస్వాల్ సూపర్ సెంచరీ
హాంగ్జౌ: ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు సెమీఫైనల్ చేరింది. మంగళవారం నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని భారత్ 23 పరుగుల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. తొలుత యశస్వి జైస్వాల్ (49 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 100) సూపర్ సెంచరీతో చెలరేగడంతో భారత్ 20 ఓవర్లలో 202/4 స్కోరు చేసింది. అంతర్జాతీయ టీ20ల్లో తొలి శతకం సాధించిన యశస్వి.. రుతురాజ్ (25)తో కలిసి తొలి వికెట్‌కు 103 పరుగులు జోడించాడు. ఛేదనలో నేపాల్ బ్యాటర్లు దూకుడుగా ఆడారు. కీలక సమయంలో భారత బౌలర్లు కట్టడి చేయడంతో నేపాల్ 20 ఓవర్లలో 179/9 స్కోరుకు పరిమితమయ్యారు. హ్యాట్రిక్ సిక్సర్లు బాదిన దీపేంద్రసింగ్ ఐరీ (15 బంతుల్లో 32) జట్టులో టాప్ స్కోరర్. రవి బిష్ణోయ్ (3/24), అవేశ్ ఖాన్ (3/32) చెరో మూడు వికెట్లు తీయగా, అర్ష్‌దీప్ (2/43) రెండు వికెట్లు పడగొట్టాడు.
సంక్షిప్త స్కోర్లు: భారత్: 20 ఓవర్లలో 202/4 (యశస్వి జైస్వాల్ 100, రింకూ సింగ్ 37 నాటౌట్, దీపేంద్ర సింగ్ 2/31); నేపాల్: 20 ఓవర్లలో 179/9 (దీపేంద్ర సింగ్ 32, బిష్ణోయ్ 3/24, అవేశ్ 3/32).
భారత్ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో సెంచరీ సాధించిన పిన్న వయసు బ్యాటర్‌గా 21 ఏళ్ల యశస్వి. ఈ క్రమంలో గిల్ (23 ఏళ్లు)ను యశస్వి అధిగమించాడు.
Updated Date - 2023-10-04T04:35:17+05:30 IST