ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పాక్‌ ఘన బోణీ

ABN, First Publish Date - 2023-08-31T03:10:16+05:30

కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (131 బంతుల్లో 151), ఇఫ్తికార్‌ అహ్మద్‌ (71 బంతుల్లో 109 నాటౌట్‌) శతకాలతోపాటు బౌలర్లు హ్యారిస్‌ రౌఫ్‌, షాదాబ్‌ విజృంభించడంతో ఆసియాకప్‌లో ఆతిథ్య పాకిస్థాన్‌ ఘనంగా బోణీ చేసింది.

238 రన్స్‌తో నేపాల్‌ చిత్తు బాబర్‌, ఇఫ్తికార్‌ శతకాలు

ముల్తాన్‌: కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (131 బంతుల్లో 151), ఇఫ్తికార్‌ అహ్మద్‌ (71 బంతుల్లో 109 నాటౌట్‌) శతకాలతోపాటు బౌలర్లు హ్యారిస్‌ రౌఫ్‌, షాదాబ్‌ విజృంభించడంతో ఆసియాకప్‌లో ఆతిథ్య పాకిస్థాన్‌ ఘనంగా బోణీ చేసింది. బుధవారం జరిగిన ఆరంభ మ్యాచ్‌లో పాక్‌ 238 పరుగుల తేడాతో పసికూన నేపాల్‌ను చిత్తు చేసింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 342 పరుగులు చేసింది. ఓపెనర్లు జమాన్‌ (14), ఇమాముల్‌ (5) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. కానీ, రిజ్వాన్‌ (44)తో కలసి మూడో వికెట్‌కు 86 పరుగులు జోడించిన బాబర్‌.. ఇఫ్తికార్‌తో కలసి ఐదో వికెట్‌కు 214 పరుగుల భాగస్వామ్యంతో జట్టుకు భారీ స్కోరు అందించాడు. డబుల్‌ సెంచరీ దిశగా సాగుతున్న బాబర్‌ను సోంపాల్‌ (2/85) క్యాచవుట్‌ చేశాడు. అనంతరం ఛేదనలో నేపాల్‌ 23.4 ఓవర్లలో 104 పరుగులకు ఆలౌటైంది. పేసర్‌ షహీన్‌ షా (2/27) దెబ్బకు 14 ఓవర్లకే మూడు టాపార్డర్‌ వికెట్లను కోల్పోయిన నేపాల్‌ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. అయితే, ఆరిఫ్‌ షేక్‌ (26), సోంపాల్‌ (28) నాలుగో వికెట్‌కు 59 పరుగుల భాగస్వామ్యంతో కొంతసేపు ప్రతిఘటించారు. కానీ, వీరిద్దరినీ రౌఫ్‌ (2/16) తన వరుస ఓవర్లలో అవుట్‌ చేయడంతో నేపాల్‌ పతనం వేగంగా జరిగిపోయింది. స్పిన్నర్‌ షాదాబ్‌ నాలుగు వికెట్లతో టెయిలెండర్ల పనిపట్టాడు. బాబర్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు.

పాకిస్థాన్‌: ఫఖర్‌ జమాన్‌ (సి) ఆసిఫ్‌ (బి) కరణ్‌ 14, ఇమాముల్‌ హక్‌ (రనౌట్‌) 5, బాబర్‌ (సి/సబ్‌) జోరా (బి) సోంపాల్‌ 151, రిజ్వాన్‌ (రనౌట్‌) 44, సల్మాన్‌ (సి) బుర్టెల్‌ (బి) లామిచానె 5, ఇఫ్తికార్‌ అహ్మద్‌ (నాటౌట్‌) 109, షాదాబ్‌ (బి) సోంపాల్‌ 4; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 50 ఓవర్లలో 342/6; వికెట్ల పతనం: 1-21, 2-25, 3-111, 4-124, 5-338, 6-342; బౌలింగ్‌: సోంపాల్‌ 10-1-85-2, కరణ్‌ 9-0-54-1, గుల్షన్‌ 4-0-35-0, లలిత్‌ 10-0-48-0, లామిచానె 10-0-69-1, దీపేంద్ర 6-0-40-0, కుశాల్‌ 1-0-10-0.

నేపాల్‌: కుశాల్‌ (సి) రిజ్వాన్‌ (బి) షహీన్‌ 8, ఆసిఫ్‌ (సి) ఇఫ్తికార్‌ (బి) నసీమ్‌ 5, రోహిత్‌ (ఎల్బీ) షహీన్‌ 0, ఆరిఫ్‌ షేక్‌ (బి) రౌఫ్‌ 26, సోంపాల్‌ (సి) రిజ్వాన్‌ (బి) రౌఫ్‌ 28, గుల్షన్‌ (సి) ఫఖర్‌ (బి) షాదాబ్‌ 13, దీపేంద్ర సింగ్‌ (బి) నవాజ్‌ 3, కుషల్‌ మల్లా (సి) ఇఫ్తికార్‌ (బి) షాదాబ్‌ 6, లామిచానె (బి) షాదాబ్‌ 0, కరణ్‌ (నాటౌట్‌) 7. లలిత్‌ (ఎల్బీ) షాదాబ్‌ 0; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 23.4 ఓవర్లలో 104 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-10, 2-10, 3-14, 4-73, 5-82, 6-90, 7-91, 8-91, 9-104; బౌలింగ్‌: షహీన్‌ షా 5-0-27-2, నసీమ్‌ షా 5-0-17-1, రౌఫ్‌ 5-1-16-2, షాదాబ్‌ 6.4-0-27-4, నవాజ్‌ 2-0-13-1.

వన్డేల్లో వేగంగా 19 సెంచరీలు చేసిన బ్యాటర్‌గా బాబర్‌ ఆజమ్‌. 102 ఇన్నింగ్స్‌లో ఈ ఘనతను సాధించిన బాబర్‌.. దక్షిణాఫ్రికా బ్యాటర్‌ హషీమ్‌ ఆమ్లా (104 ఇన్నింగ్స్‌లు) రికార్డును అధిగమించాడు. విరాట్‌ కోహ్లీ 124 ఇన్నింగ్స్‌లో 19 శతకాలు బాదితే.. డేవిడ్‌ వార్నర్‌ 139, డివిల్లీర్స్‌ 171 ఇన్నింగ్స్‌ల్లో ఈ మార్క్‌ను అందుకొన్నారు.

Updated Date - 2023-08-31T03:17:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising