ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

WTC Final : ఓవల్‌లో ఆసీస్‌..ప్చ్‌

ABN, First Publish Date - 2023-06-02T04:02:27+05:30

భారత్‌తో జరిగే వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ కోసం ఆస్ట్రేలియా జట్టు సన్నాహకాలు జోరుగా సాగుతున్నాయి. మరోవైపు ఓవల్‌ మైదానంలో వారి గత ప్రదర్శన ఆందోళనపరుస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డబ్ల్యూటీసీ ఫైనల్‌ వేళ ‘కంగారు’

లండన్‌: భారత్‌తో జరిగే వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ కోసం ఆస్ట్రేలియా జట్టు సన్నాహకాలు జోరుగా సాగుతున్నాయి. మరోవైపు ఓవల్‌ మైదానంలో వారి గత ప్రదర్శన ఆందోళనపరుస్తోంది. ఈనెల 7 నుంచి 11 వరకు ఈ మ్యాచ్‌ జరుగుతుంది. 1880లో ఆసీస్‌ జట్టు ఇంగ్లండ్‌ గడ్డపై ఆడిన తొలి టెస్టు ఓవల్‌లోనే జరిగింది. అప్పటినుంచి ఆడిన 38 టెస్టుల్లో ఇక్కడ కేవలం ఏడింట్లోనే నెగ్గింది. ఇంగ్లండ్‌లోని ఇతర వేదికలతో పోలిస్తే ఓవల్‌లోనే ఆసీ్‌సకు అతి తక్కువ (18.42) విజయాల శాతం ఉండడం గమనార్హం. ఇంకా చెప్పుకోవాలంటే గత 50 ఏళ్లలో రెండుసార్లు మాత్రమే గెలిచింది. అందుకే భారత్‌తో జరిగే ఫైనల్‌ పోరులో నెగ్గి ఓవల్‌లో తమ పేలవ రికార్డును మెరుగుపర్చుకోవాలనుకుంటోంది. ఈనేపథ్యంలో ఆసీస్‌ ఆటగాళ్లు గురువారం బెకెన్‌హామ్‌ గ్రౌండ్‌లో పూర్తి స్థాయిలో నెట్స్‌లో గడిపారు. మ్యాచ్‌ జరిగే ఓవల్‌ మైదానంలో ప్రాక్టీస్‌, ఇతరత్రా సౌకర్యాలను ఉపయోగించుకోవాలంటే ప్రస్తుతానికి ఇరుజట్లకూ అనుమతిలేదు. మ్యాచ్‌కు రెండు రోజుల ముందు నుంచి మాత్రమే ఇరు జట్లకు అవకాశం ఉంటుంది.

ఐపీఎల్‌లోనే ప్రాక్టీస్‌ చేశాం: అక్షర్‌

టీ20 ఫార్మాట్‌ నుంచి టెస్టులకు మారడం సవాల్‌తో కూడుకుందని భారత స్పిన్నర్‌ అక్షర్‌ అంగీకరించాడు. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్‌ను దృష్టిలో ఉంచుకుని ఐపీఎల్‌ సమయంలోనే తామంతా డ్యూక్‌ బంతులతో ప్రాక్టీస్‌ చేశామని తెలిపాడు. ఇంగ్లండ్‌లో పరిస్థితులు భారత్‌ తరహాలో ఉండవు కాబట్టి, ఇక్కడ ఎలాంటి లైన్‌ అండ్‌ లెంగ్త్‌ అవసరమవుతుందో తెలుసుకుని ముందుకెళుతున్నామని చెప్పాడు.

స్మిత్‌, కోహ్లీలను కట్టడి చేస్తేనే..: ఫించ్‌

బ్ల్యూటీసీ ఫైనల్లో ఆసీస్‌ నుంచి స్టీవ్‌ స్మిత్‌, భారత్‌ నుంచి విరాట్‌ కోహ్లీ కీలకంగా వ్యవహరిస్తారని మాజీ కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ అభిప్రాయపడ్డాడు. ‘ఈ ఇద్దరూ నాలుగో నెంబర్‌లోనే బరిలోకి దిగుతారు. వీరిని ఇరు జట్ల బౌలర్లు కూడా వీలైనంత త్వరగా అవుట్‌ చేయడం అవసరం. ఓవల్‌లో స్మిత్‌కు అద్భుత రికార్డు ఉంది. ఏదిఏమైనా ఇరు జట్ల మధ్య ఆసక్తికర సమరం జరగడం ఖాయం’ అని ఫించ్‌ అన్నా డు. మరోవైపు ఆసీస్‌ జట్టు చటేశ్వర్‌ పుజార, విరాట్‌ కోహ్లీలపై ప్రత్యేక దృష్టి సారించాలని మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ సూచించాడు. ము ఖ్యంగా కౌంటీల్లో ససెక్స్‌ తరఫున విశేషంగా రాణించాడని, ఇక కోహ్లీ సైతం ఐపీఎల్‌లో రెండు శతకాలు, ఆరు అర్ధసెంచరీలతో టచ్‌లో ఉ న్నాడని గుర్తుచేశాడు. ఈ ఇద్దరి కట్టడికి చక్కటి ప్రణాళికలతో ఆసీస్‌ బరిలోకి దిగాల్సి ఉంటుందని పాంటింగ్‌ తెలిపాడు.

Updated Date - 2023-06-02T05:05:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising