Asia Cup 2023 : సెప్టెంబరు 2న భారత్ X పాక్
ABN, First Publish Date - 2023-07-20T03:25:10+05:30
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆసియా కప్ షెడ్యూల్ వచ్చేసింది. పాకిస్థాన్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ ఆసియా కప్ వన్డే టోర్నీ ఆగస్టు 30న మొదలై, సెప్టెంబరు 17న ముగియనుంది.
ఆగస్టు 30న టోర్నీ ఆరంభం
ముంబై: క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆసియా కప్ షెడ్యూల్ వచ్చేసింది. పాకిస్థాన్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ ఆసియా కప్ వన్డే టోర్నీ ఆగస్టు 30న మొదలై, సెప్టెంబరు 17న ముగియనుంది. టోర్నీలో తొలి మ్యాచ్ ఆతిథ్య పాక్-నేపాల్ జట్ల మధ్య పాకిస్థాన్‌లోని ముల్తాన్‌లో జరగనుంది. ఫైనల్‌కు శ్రీలంకలోని కొలంబో వేదిక కానుంది. టోర్నీలో అత్యంత కీలకమైన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ సెప్టెంబరు 2న లంకలోని క్యాండీలో జరగనుంది. టీమిండియా రెండో మ్యాచ్‌ను సెప్టెంబరు 4న నేపాల్‌తో క్యాండీలోనే ఆడనుంది. హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించే ఈ టోర్నీలో 4 మ్యాచ్‌లు పాకిస్థాన్‌లో, మిగతా 9 మ్యాచ్‌లు శ్రీలంకలో జరుగుతాయి. టోర్నీలో మొత్తం 6 జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి ఆడనున్నాయి. ప్రతి గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్-4కు అర్హత సాధిస్తాయి. సూపర్-4లో టాప్ 2 జట్లు ఫైనల్ ఆడతాయి. షెడ్యూల్ ప్రకారం టోర్నీ మొత్తానికి పాకిస్థాన్ ఆతిథ్యమివ్వాల్సి ఉన్నా.. అక్కడికి వెళ్లేందుకు భారత్ నిరాకరించడంతో లంకకు కొన్ని మ్యాచ్‌లను తరలించారు.
ఆసియా కప్ షెడ్యూల్
గ్రూప్ ఎ: భారత్, పాకిస్థాన్, నేపాల్
గ్రూప్ బి: శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్
ఆగస్టు 30 పాకిస్థాన్X నేపాల్ ముల్తాన్
ఆగస్టు 31 బంగ్లాదేశ్X శ్రీలంక క్యాండీ
సెప్టెంబరు 2 భారత్X పాకిస్థాన్ క్యాండీ
సెప్టెంబరు 3 బంగ్లాదేశ్X అఫ్ఘానిస్థాన్ లాహోర్
సెప్టెంబరు 4 భారత్X నేపాల్ క్యాండీ
సెప్టెంబరు 5 అఫ్ఘానిస్థాన్X శ్రీలంక లాహోర్
సూపర్-4 మ్యాచ్‌లు
సెప్టెంబరు 6 ఎ1X బి2 లాహోర్
సెప్టెంబరు 9 బి1X బి2 కొలంబో
సెప్టెంబరు 10 ఎ1 X ఎ2 కొలంబో
సెప్టెంబరు 12 ఎ2X బి1 కొలంబో
సెప్టెంబరు 14 ఎ1X బి1 కొలంబో
సెప్టెంబరు 15 ఎ2Xబి2 కొలంబో
సెప్టెంబరు 17 ఫైనల్ కొలంబో
Updated Date - 2023-07-20T03:25:10+05:30 IST