ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Alcaraz : వచ్చాడు మొనగాడు!

ABN, First Publish Date - 2023-07-17T00:58:12+05:30

జొకోవిచ్‌, ఫెడరర్‌, నడాల్‌..దిగ్గజ త్రయాన్ని సవాలు చేసే ఆటగాడొచ్చాడు. ఇటీవలి వరకు ఈ త్రయం వారసుడెవరు? అని ప్రశ్నిస్తే ఠక్కున సమాధానం ఇవ్వలేని పరిస్థితి. సిట్సిపాస్‌, సిన్నర్‌, రూడ్‌ వంటి ఆటగాళ్లున్నా..ముగ్గురు మొనగాళ్లలో ఒకరినైనా ఓడించి గ్రాండ్‌స్లామ్‌ అందుకొన్న ఘనత వారింకా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

జొకోవిచ్‌, ఫెడరర్‌, నడాల్‌..దిగ్గజ త్రయాన్ని సవాలు చేసే ఆటగాడొచ్చాడు. ఇటీవలి వరకు ఈ త్రయం వారసుడెవరు? అని ప్రశ్నిస్తే ఠక్కున సమాధానం ఇవ్వలేని పరిస్థితి. సిట్సిపాస్‌, సిన్నర్‌, రూడ్‌ వంటి ఆటగాళ్లున్నా..ముగ్గురు మొనగాళ్లలో ఒకరినైనా ఓడించి గ్రాండ్‌స్లామ్‌ అందుకొన్న ఘనత వారింకా సాధించలేదు. కానీ స్పెయిన్‌ యువ కెరటం అల్కరాస్‌ ప్రపంచ టెన్నిస్‌లో అడుగుపెట్టిన కొద్దికాలంలోనే రెండు గ్రాండ్‌స్లామ్‌లు సొంతం చేసుకోవడం..అందులో ఒక టైటిల్‌ను జొకోవిచ్‌ను ఓడించి అందుకోవడం అతడి సత్తాకు నిదర్శనం. అందుకే పురుషుల టెన్నిస్‌ భావి స్టార్‌గా కార్లో్‌సను టెన్నిస్‌ పండితులు పరిగణిస్తున్నారు. ఐదుసెట్ల సమరంలో అమోఘమైన రికార్డు కలిగిన జొకోవిచ్‌ను ఓడించడమంటే ఆషామాషీకాదు. 19ఏళ్లకే నెంబర్‌ వన్‌ ర్యాంక్‌ కైవసం చేసుకొని రికార్డు సృష్టించడంతోనే అందరి దృష్టి ఈ స్పెయిన్‌ టీనేజర్‌పై పడింది. మూడు సంవత్సరాల ప్రొఫెషనల్‌ కెరీర్‌లోనే 2 గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గడం అతడి ప్రతిభకు తార్కాణం. రెండు అంశాల్లో జొకోవిచ్‌, నడాల్‌తో అల్కరా్‌సకు పోలిక ఉంటుంది. శారీరక దారుఢ్యం, దూకుడైన ఆటతో నడాల్‌ను తలపిస్తాడు. ఇక కోర్టు నలుమూలలా పరిగెడుతూ ప్రత్యర్థుల షాట్లను తిప్పికొట్టే కొట్టే తీరు అచ్చం జొకోలా ఉంటుంది. మరి దిగ్గజ త్రయంలోని ఇద్దరు స్టార్ల ఆటను పుణికిపుచ్చుకున్న అల్కరాస్‌ భవిష్యత్‌లో వారి స్థాయిని చేరుకుంటాడేమో చూడాలి.

Updated Date - 2023-07-17T00:58:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising