ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒకే ఓవర్‌లో 5 వికెట్లు

ABN, First Publish Date - 2023-02-27T02:20:58+05:30

ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్‌లో అరుదైన ఘటన చోటు చేసుకొంది. మహిళల జాతీయ క్రికెట్‌ లీగ్‌ వన్డే ఫైనల్లో టాస్మేనియా జట్టు చివరి ఓవర్‌లో ఏకంగా ఐదు వికెట్లు కూల్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్‌లో అరుదైన ఫీట్‌

హోబర్ట్‌: ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్‌లో అరుదైన ఘటన చోటు చేసుకొంది. మహిళల జాతీయ క్రికెట్‌ లీగ్‌ వన్డే ఫైనల్లో టాస్మేనియా జట్టు చివరి ఓవర్‌లో ఏకంగా ఐదు వికెట్లు కూల్చింది. ఒక్క పరుగు (డ/లూ) తేడాతో సౌత్‌ ఆస్ట్రేలియా జట్టుపై ఉత్కంఠ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టాస్మేనియా నిర్ణీత 50 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. ఛేదనలో వర్షం ఆటంకం కలిగించే సమయానికి సౌత్‌ ఆస్ట్రేలియా 44 ఓవర్లలో 220/5 స్కోరు చేసింది. డక్‌వర్త్‌/లూయిస్‌ పద్ధతి ప్రకారం అప్పటికే సౌత్‌ ఆస్ట్రేలియా టీమ్‌ 5 పరుగుల ఆధిక్యంలో ఉంది. కానీ, వర్షం ఆగిపోవడంతో లక్ష్యాన్ని 47 ఓవర్లలో 243 రన్స్‌కు కుదించారు. అయితే, చివరి ఓవర్‌లో గెలుపునకు 4 పరుగులు కావాల్సి ఉండగా.. నాటకీయ రీతిలో 2 పరుగులు మాత్రమే చేసిన సౌత్‌ ఆస్ట్రేలియా మిగిలిన 5 వికెట్లు చేజార్చుకొని 241 రన్స్‌కు ఆలౌటైంది. చివరి ఓవర్‌ను బౌల్‌ చేసిన సారా కాయ్‌టే మూడు వికెట్లు పడగొట్టగా.. ఇద్దరు రనౌటయ్యారు.

Updated Date - 2023-02-27T02:20:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising