ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral: సొంత అల్లుడు అపరకుబేరుడైనా చిన్న కిరాణా దుకాణం నడుపుకుంటున్న మామ! ఈయన ఎవరో తెలిస్తే..

ABN, First Publish Date - 2023-05-09T15:51:33+05:30

జెరోధా సంస్థ వ్యవస్థాపకుడు నితిన్ కామత్ తాజాగా ఓ ఆసక్తికథనాన్ని షేర్ చేశారు. తాను కోటీశ్వరుడినైనా తన మామగారు మాత్రం ఇంకా కిరాణా దుకాణం నడుపుకుంటున్నారని చెప్పుకొచ్చారు. లైఫ్‌లో సంతోషంగా ఉండాలంటే నిత్యంయాక్టివ్‌గా ఉండాలని తన మామ జీవితం చూసి నేర్చుకోవచ్చని అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: కూతురో అల్లుడో లేదా కొడుకో కోడలో కుబేరులైతే ఇక వారి తల్లిదండ్రులు లేదా అత్తమామల జీవితం నల్లేరు మీద నడకే అని అనుకుంటాం. ఇంట్లో నౌకర్లు చాకర్లతో జీవితచరమాంకంలో కులాసాగా గడిపేస్తారని అనుకుంటాం. కానీ తన సొంత అల్లుడు, కూతురు అపరకుబేరులైనా ఓ వ్యక్తి మాత్రం చిన్న కిరాణా దుకాణం నడుపుకుంటున్నారంటే మీరే మంటారు? ఏంటి ఆశ్చర్యపోతున్నారా? ఈ ఉదంతం మరెక్కడో కాదు మన దేశంలోనే జరిగింది. ప్రముఖ ఆన్‌లైన్ ట్రేడింగ్ సంస్థ జెరోధా(Zerodha) వ్యవస్థాపకుడు నితిన్ కామత్(Nithin Kamath) తనకు పిల్లనిచ్చిన మామయ్య(Father-in-law) గురించి నెట్టింట్ షేర్ చేసిన విషయాలు ప్రస్తుతం వైరల్‌గా(Viral) మారాయి.

నితిన్ కామత్ మామ ఆర్మీలో పని చేసి రిటైర్ అయ్యారు. ఆయన వయసు డబ్భైఏళ్లు. కార్గిల్ యుద్ధం సమయంలో అక్కడి చలివాతావరణం కారణంగా తన చేతికున్న రెండు వేళ్లను కోల్పోయారు. కూతురు అల్లుడూ కుబేరులైనా కూడా ఆయన మాత్రం ప్రస్తుతం చిన్న కిరాణా దుకాణం నడుపుకుంటున్నారు. 20 ఏళ్ల పాత స్కూటర్‌పై రోజూ మార్కెట్‌కు వెళ్లి వస్తువులు తెచ్చుకుంటుంటారు. ఆయన భార్య కూడా చేదోడువాదోడుగా ఉంటుంది.

‘‘నేను, సీమా(నితన్ భార్య) కెరీర్‌లో ఎంతో విజయవంతమైనా ఆయన మాత్రం పని చేయడం మానట్లేదు. షాపులో వచ్చే లాభాల గురించి నేను అడిగినప్పుడల్లా ఆయన కళ్లల్లో ఎదో మెరుపు కనిపిస్తుంది. చిక్కీలపై పావు శాతం లాభం వస్తుందంటూ సంబరంతో చెబుతారు. కార్గిల్ యుద్ధం తరువాత ఆయన ఆ కిరాణా షాపు ప్రారంభించారు. లైఫ్‌లో ఇది కావాలని ఆయన ఆశించడం గానీ, ఏదో దక్కలేదని అసహనం వ్యక్తం చేయడం నెనెప్పుడూ చూడలేదు. నేను మీ కూతుర్ని పెళ్లి చేసుకుంటానని 2007లో చెప్పినప్పుడు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోమని నాకు సలహా ఇచ్చారు. లైఫ్‌లో సుదీర్ఘకాలం పాటు సంతోషంగా ఎలా జీవించాలనే విషయంలో నేను సోషల్ మీడియాలో ఊదర గొడుతుంటాను కానీ నాకు తెలిసీ ఆయన జీవితకంటే మంచి ఉదాహరణ మరొకటి ఉండదేమో. ఈ సంతోషం డబ్బుతో వచ్చేది కాదు. నిత్యం మానసికంగా శారీరకంగా యాక్టివ్‌గా ఉండటంలోనే అసలైన ఆనందం దాగుంది.’’ అని ఆయన తన పోస్ట్ ముగించారు. ఈ ట్వీట్ నెటిజన్లకు తెగ నచ్చడంతో దీన్ని తెగ వైరల్ చేస్తున్నారు. ఆయన జీవితం నిజంగా స్ఫూర్తివంతమంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Updated Date - 2023-05-09T15:51:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising