Shocking Video: స్మార్ట్ఫోన్లోంచి పొగలు వస్తోంటే ఇదేం పని.. తాపీగా కూర్చుని మరీ ఈ కుర్రాడు ఏం చేశాడో మీరే చూడండి..!
ABN, First Publish Date - 2023-04-03T20:05:45+05:30
స్మార్ట్‌ఫోన్లోంచి పొగలు వచ్చినా లెక్కచేయని యువకుడు. యాథావిధిగా చాటింగ్. యువకుడి తీరుకు విస్తుపోతున్న నెటిజన్లు.
ఇంటర్నెట్ డెస్క్: స్మార్ట్ ఫోన్లకు విపరీతంతా అలవాటు పడిపోయిన యువత ఫోన్లు జాగ్రత్తల విషయంలో మాత్రం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. చార్జింగ్‌లో పెట్టిన సెల్‌ఫోన్‌ను వాడటంతో పాటూ ఫోన్ వేడెక్కుతున్నా పట్టించుకోకుండా, ఫోన్‌కు కాసంతైనా విరామం ఇవ్వకుండా తెగ వాడిపారేస్తుంటారు. ఇలాగై ప్రమాదం తప్పదని తెలిసీ రిస్క్‌కు వెనకాడరు కొందరు. ఈ క్రమంలోనే పలు ప్రాణాంతక ప్రమాదాలు కూడా జరిగాయి. అయినా కూడా ప్రజల్లో ఆశించినంత మార్పులు రావట్లేదని సామాజిక కార్యకర్తలు వాపోతుంటారు. వారి ఆందోళనకు అద్దం పట్టేలా ఉన్న ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా(Viral Video) మారింది.
ఓ యువకుడు తన స్మార్ట్‌ఫోన్‌తో టైప్ చేస్తూ ఉన్న సన్నివేశంతో ఈ వీడియో మొదలవుతుంది. అక్కడి వరకూ బాగానే ఉన్నా ఆ తరువాత సీన్ ఒక్కసారిగా మారిపోతుంది. ఓవైపు..తన చేతిలోని స్మార్ట్‌ఫోన్‌లోంచి పొగలు(Fumes in Smart Phone) బయటకు వస్తున్నా అతడు తన ధోరణిని యథాతథంగా కొనసాగించాడు. అక్కడితోనే వీడియో ముగిపోవడంతో ఆ తరువాత ఏం జరిగిందనే దానిపై స్పష్టత లేదు.
అయితే.. నెటిజన్లను మాత్రం ఈ వీడియో బాగా ఆకర్షించింది. యువకుడు చాలా నిర్లక్ష్యంగా ఉన్నాడంటూ అనేక మంది కామెంట్ చేశారు. మరికొందరు మాత్రం ఇదేదో స్టంట్ అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ఇలా ఎవరి అభిప్రాయాలను వారు వ్యక్తం చేస్తూ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు.
Updated Date - 2023-04-03T20:07:09+05:30 IST