ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆయన చదువుల్లో రారాజు.. ఎన్ని పిహెచ్‌డీలు చేశాడో, ఎన్ని భాషల్లో ప్రావీణ్యం సంపాదించాడో తెలిస్తే...

ABN, First Publish Date - 2023-04-22T07:58:25+05:30

ప్రపంచంలో అత్యధికంగా చదువుకున్నవారు చాలామంది ఉంటారు. అయితే వీరందరినీ మించి ఒక వ్యక్తి చదువుల్లో(studies) ఢంకా బజాయిస్తున్నాడు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రపంచంలో అత్యధికంగా చదువుకున్నవారు చాలామంది ఉంటారు. అయితే వీరందరినీ మించి ఒక వ్యక్తి చదువుల్లో(studies) ఢంకా బజాయిస్తున్నాడు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలో అత్యధికంగా చదువుకున్న వ్యక్తి పేరు ప్రొఫెసర్ అబ్దుల్ కరీం బంగూర(Professor Abdul Karim Bangura). అతను ఆఫ్రికన్ దేశం సియెర్రా లియోన్‌కు చెందిన వ్యక్తి. ప్రొఫెసర్ అబ్దుల్ కరీం బంగూర మొత్తం ఐదు సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ(Ph.D) చేశారు. ఆయన 1953,ఆగస్టు 26 న సియెర్రా లియోన్‌లోని బో ప్రావిన్స్‌లో జన్మించాడు.

ప్రారంభ విద్యను తన సొంత దేశంలోనే చేశాడు. తదుపరి విద్యను అమెరికా(America)లో పూర్తి చేశాడు. అతని తండ్రి ఉత్తర సియెర్రా లియోన్‌లో ఉన్న పోర్ట్ లోకో నగరానికి చెందిన బంగూరా చీఫ్‌ల వారసుడు. అతని పేరు అలీ కుందా బంగూర. వృత్తి రీత్యా ఆయన ఇంజనీర్(Engineer). ఒక ఇంటర్వ్యూలో అబ్దుల్ కరీం బంగూర మాట్లాడుతూ. తన తండ్రి అన్యాయం, అణచివేతపై పోరాడాలని తనకు ఎప్పుడూ బోధించేవారన్నారు. పీడిత ప్రజల తరపున నిలబడాలని తనకు చెప్పేవారన్నారు.

18 భాషల్లో పరిజ్ఞానం

ఇప్పటి వరకు ప్రొఫెసర్ అబ్దుల్ కరీం బంగూర 35 పుస్తకాలు, 250 వ్యాసాలను(250 articles) రచించారు. ఇదేకాకుండా అతను 18 భాషల్లో మాట్లాడగలడు. వీటిలో ఇంగ్లీష్, ఫ్రెంచ్, అరబిక్, కరియో, ఫూలా, కోనో, లింబా, టెమ్నే, మెండే, షెర్బో, స్వాహిలి, స్పానిష్, ఇటాలియన్, స్వీడిష్ మొదలైనవి ఉన్నాయి.

ఈ సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ

ప్రొఫెసర్ అబ్దుల్ కరీం బంగూర PhD డిగ్రీల ప్రస్తావనకు వస్తే అతను పొలిటికల్ సైన్స్‌లో PhD, డెవలప్‌మెంట్ ఎకనామిక్స్‌లో PhD, భాషాశాస్త్రంలో PhD, కంప్యూటర్ సైన్స్‌లో PhD, గణితంలో PhD పూర్తి చేశాడు. అంతేకాదు అతను ఇంటర్నేషనల్ స్టడీస్‌(International Studies)లో బిఎ, ఇంటర్నేషనల్ అఫైర్స్‌లో ఎంఎ, లింగ్విస్టిక్స్‌లో ఎంఎస్ డిగ్రీలు కూడా చేశాడు.

Updated Date - 2023-04-22T08:30:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising