ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Why Dogs Chase Bikes: కుక్కలు మీ వాహనం వెంటపడి, భీకరంగా మొరుగుతూ వెంబడిస్తున్నాయా? దానికి కారణం ఇదే... వెంటనే ఏం చేయాలంటే?

ABN, First Publish Date - 2023-03-09T09:32:41+05:30

Why Dogs Chase Bikes: మీరు హాయిగా బైక్‌పై లేదా కారులో వెళుతుంటే, రోడ్డుపై చుట్టుపక్కల(Around) ఉండే కుక్కలు బిగ్గరగా మొరగడం, మీ వాహనం వెంట పరుగెత్తడాన్ని మీరు చూసే ఉంటారు. దీని వల్ల ఒక్కోసారి రోడ్డు ప్రమాదాలు(Road accidents) కూడా జరుగుతుంటాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

Why Dogs Chase Bikes: మీరు హాయిగా బైక్‌పై లేదా కారులో వెళుతుంటే, రోడ్డుపై చుట్టుపక్కల(Around) ఉండే కుక్కలు బిగ్గరగా మొరగడం, మీ వాహనం వెంట పరుగెత్తడాన్ని మీరు చూసే ఉంటారు. దీని వల్ల ఒక్కోసారి రోడ్డు ప్రమాదాలు(Road accidents) కూడా జరుగుతుంటాయి.

అయితే కుక్కలు ఇలా ఎందుకు చేస్తాయో తెలుసా? సాధారణంగా మనుషులకు విధేయంగా, స్నేహపూర్వకం(friendly)గా ఉండే కుక్కలు బైక్‌పై లేదా కారులో ఉన్నవారికి అకస్మాత్తుగా బద్ధ శత్రువులు(sworn enemies)గా ఎందుకు మారతాయి? కుక్కలకు సంబంధించిన నిపుణుల అభిప్రాయం ప్రకారం కుక్కల శత్రుత్వం మీతో కాదు, మీ వాహనం టైర్లతో అని తెలిస్తే ఆశ్చర్యపోతారు.

నిజానికి కుక్కలకు వాసనాశక్తి(sense of smell) బలంగా ఉంటుంది. అలాగే అవి ఇతర కుక్కల వాసనను గ్రహించి, గుర్తుపెట్టుకుంటాయి. అప్పుడప్పుడు కుక్కలు వాహనాల టైర్ల(tires)పై మూత్రవిసర్జన చేస్తాయి. అటువంటి పరిస్థితిలో ఆ వాహనం ఏదైనా కాలనీ లేదా రహదారి గుండా వెళుతున్నప్పుడు, అక్కడి కుక్కలు ఆ వాహనం టైర్ల వాసన(smell of tires)ను గుర్తించి, అవి వేరే కుక్కలవని తెలుసుకుంటాయి. దీంతో అవి ఆ వాహనం వెనుక పడి, మెరుగుతూ, పరుగులు పెడతాయి.

సాధారణంగా ఏదైనా కాలనీలోకి కొత్త కుక్క వస్తే, అప్పటికే కాలనీలో ఉన్న కుక్కలన్నీ దాన్ని తరిమివేయడాన్ని మీరు చూసే ఉంటారు. వాస్తవానికి, కుక్కలు ఒక ప్రాంత పరిధికి లోబడి ఉంటాయి. ఈ ప్రాంతంలోకి మరో కుక్క రావడాన్ని అవి అస్సలు ఇష్టపడవు(don't like). కారు లేదా బైక్ టైర్ నుండి మరొక కుక్క మూత్రం వాసన వచ్చినప్పుడు, తమ ప్రాంతానికి కొత్త కుక్క(new dog) వచ్చినట్లు అవి అనుభూతి చెందుతారు. అందుకే అవి వాహనాల వెంటపడతాయి. కారు టైర్లు ముందుకు కదులుతున్నప్పుడు కొత్త కుక్కలు తమపై దాడి(attack)కి సిద్ధమవుతున్నాయని అక్కడున్న కుక్కలు భావిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

కాగా ఇటువంటి సందర్భంలో చాలా మంది ఆందోళన(worry) పడిపోయి, తమ కారు లేదా బైక్‌ను వేగంగా నడపడం ప్రారంభిస్తారు. ఫలితంగా కుక్కల అనుమానం(Doubt) మరింత బలంగా మారుతుంది. దీంతో అవి మరింత దూకుడుగా వ్యవహరిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో(circumstances) వాహనదారులు కంగారు పడకపోవడమే తెలివైన పని అంటున్నారు నిపుణులు(Experts). అటువంటి సమయంలో వాహనాన్ని నెమ్మదిగా పోనిస్తూ అక్కడి కుక్కలకు ఎటువంటి ప్రమాదం(accident) లేదని భరోసా కల్పించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Updated Date - 2023-03-09T09:39:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising