ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ATM Card Pin: ఏటీఎం కార్డు పిన్ నెంబర్‌లో నాలుగు అంకెలే ఎందుకుంటాయో తెలిస్తే..

ABN, First Publish Date - 2023-04-17T12:38:48+05:30

ఏ కార్డు పిన్ నెంబర్ చూసినా నాలుగు అంకెలకు మించదు. ఇలా ఎందుకు అన్న సందేహం ఎప్పుడైనా కలిగిందా?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుత కాలంలో ఏటీఎంలు లేకపోతే క్షణం గడవదు. అకౌంట్లోంచి ఎప్పుడు డబ్బులు విత్‌డ్రా చేసుకోవాలన్న వెళ్లేది ఏటీఎంకే(ATM Machine)! ఏటీఎంలు, నెట్ బ్యాకింగ్ రాకతో బ్యాంకులకు వెళ్లే అవసరమే లేకుండా పోయింది. ఇక బ్యాంకులు ఇచ్చే డెబిట్ లేదా ఏటీఎం కార్డులు దుర్వినియోగం కాకుండా ఓ పిన్ నెంబర్ కూడా ఉంటుంది. ఏటీఎంలో డెబిట్ కార్డు పెట్టి పిన్ నెంబర్ ఎంటర్ చేస్తేనే డబ్బులు వచ్చేది. ఇక్కడివరకూ అందరికీ తెలిసిందే. కానీ.. ఏ కార్డు పిన్ నెంబర్ చూసినా నాలుగు అంకెలకు మించదు. ఇలా ఎందుకు అన్న సందేహం ఎప్పుడైనా కలిగిందా? మరి సమాధానం తెలుసుకుందాం పదండి.

జాన్ షెపర్డ్ బ్యారన్(John Shepard Barron) అనే ఇంజినీర్ 1969లో ఏటీఎం యంత్రాన్ని కనిపెట్టారు. ఓ రోజు స్నానం చేస్తుండగా ఆయనకు ఈ యంత్రాన్ని డిజైన్ చేయాలన్న ఐడియా వచ్చింది. మరి బ్యాంకు కస్టమర్లు మాత్రమే ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేసుకునేలా ఏం చేయాలా అని ఆలోచించగా పిన్ నెంబర్‌ ఆలోచన మదిలోమెదిలింది. మొదట ఆయన ఏటీఎం కార్డు పిన్ నెంబర్‌కు ఆరు సంఖ్యలు ఉంటే భద్రతాపరంగా ఎటువంటి ఢోకా ఉండదు అని అనుకున్నారట. ఇదే విషయాన్ని తన భార్య కెరోలిన్‌కు(Caroline) చెప్పగా ఆమె పెదవివిరిచిందట. అంత పెద్ద నెంబర్ గుర్తుపెట్టుకోవడం మహా కష్టం అని కుండబద్దలు కొట్టిందట. దీంతో..ఆయన నాలుగు అంకెలున్న పిన్ నెంబర్‌తో(4 digit Pin Number) ఏటీఎం యంత్రాన్ని డిజైన్ చేశారు.

అలా, జాన్ షెపర్డ్ సతీమణి మతిమరుపే తరువాతి కాలంలో మనందరి పాలిట వరంగా మారింది. ఈజీగా గుర్తుండిపోయే నాలుగు అంకెల ఏటీఎం పిన్ ఉనికిలోకి వచ్చింది. నాటి నుంచి ఇది ప్రపంచవ్యాప్తంగా ఓ సంప్రదాయంగా కొనసాగుతోంది. అయితే.. నాలుగు అంకెలు ఏవో దొంగలు సులభంగా గుర్తించే అవకావం ఉండటంతో ఏటీఎంలో అనేక భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి. ముఖ్యంగా మూడుసార్లకు మించి ఏటీఎంలో తప్పు పిన్ ఎంటర్ చేస్తే ఆరోజుకు కార్డు బ్లాక్ అయిపోవడంతో పాటూ కస్టమర్లకు కార్డ్ బ్లాక్ అయిన విషయం ఎస్ఎంఎస్ ద్వారా తెలుస్తుంది.

Updated Date - 2023-04-17T12:44:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising