ప్రతీ కారులో కనిపించే డబ్ల్యుడీ-40 టిన్ గురించి మీకు తెలుసా? దానితో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే...
ABN, First Publish Date - 2023-04-22T09:23:33+05:30
కార్లలో కనిపించే డబ్ల్యుడి-40(WD-40) అనే టిన్‌ను ఎప్పుడైనా గమనించారా? అది ఎందుకు ఉపయోగపడుతుందనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. రూ. 250 నుంచి రూ. 300కు లభించే ఈ టిన్‌తో దాదాపు రెండు వేల పనులు చేసుకోవచ్చు.
కార్లలో కనిపించే డబ్ల్యుడి-40(WD-40) అనే టిన్‌ను ఎప్పుడైనా గమనించారా? అది ఎందుకు ఉపయోగపడుతుందనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. రూ. 250 నుంచి రూ. 300కు లభించే ఈ టిన్‌తో దాదాపు రెండు వేల పనులు చేసుకోవచ్చు. కారు తుప్పు(rust) పట్టకుండా కాపాడటం మొదలుకొని, కారు తలుపులలో శబ్దం వచ్చినప్పుడు తేమ ఇవ్వడం వరకు ప్రతిదానికీ కారు వినియోగదారులు(Car users) దీనిని ఉపయోగిస్తారు. అయితే WD-40లో WD యొక్క పూర్తి అర్థం ఏమిటో, దానిలో 40 అంటే ఏమిటో మీకు తెలుసా?
ఈ ఉత్పత్తి 1953 సంవత్సరంలో తయారు చేశారు. US అట్లాస్ క్షిపణులను (Atlas missiles)తుప్పు పట్టకుండా కాపాడటానికి WD-40 ఉపయోగించారు. WD-40 రసాయన శాస్త్రవేత్త నార్మ్ లార్సెన్(Norm Larsen) రూపొందించారు. దీని తరువాత క్రమంగా ఇది ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యింది. ప్రస్తుతం ఇది 180కి మించిన దేశాలలో ఉపయోగిస్తున్నారు. దీని పూర్తి అర్థం.. వాటర్ డిస్‌ప్లేస్‌మెంట్(Water displacement), 40వ సూత్రం. దీని తయారీకి 40 ప్రయత్నాలు జరిగాయి. అనంతమే ఈ ఉత్పత్తి రూపొందింది. ఈ కారణంగా దాని పేరుకు 40 అనేది జతచేరింది.
Updated Date - 2023-04-22T09:49:50+05:30 IST