ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: నా మొగుడు ఎవరు అంటూ ఒకటే గోల.. నెట్టింట్లో వైరల్ అవుతన్న ఈ వీడియో చూస్తే..

ABN, First Publish Date - 2023-09-18T19:36:17+05:30

నా మొగుడేడీ అంటూ ఓ చిన్నిపాప తెగ మారం చేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట్లో ట్రెండింగ్‌గా మారింది.

ఇంటర్నెట్ డెస్క్: చిన్నపిల్లల్లో దేవుడు ఉంటాడని పెద్దలు చెబుతారు. అందుకే వారు ఏం చేసినా క్యూట్‌గా అనిపిస్తుంది. వాళ్ల అమాయకపు ప్రశ్నలు, అల్లరి, తొటివారితో గిల్లికజ్జాలు, కోపతాపాలు.. ఇలా ఒకటేమిటి ప్రతిదీ ఒక హైలైటే. మనిషి జీవితంలో బాల్యం కంటే అందమైన దశ మరొకటి ఉండదు. అందుకే నెట్టింట్లో చిన్నారుల వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. ఇలా అప్‌లోడ్ చేయగానే అలా లక్షల్లో వ్యూస్ వచ్చిపడతాయి. తాజాగా వైరల్‌ అవుతున్న ఓ బాలిక వీడియో అచ్చు అలాంటిదే.


ఈ వీడియోలో బాలికకు అయిదేళ్ల లోపే ఉంటాయి. కానీ, ఎందుకో గానీ చిన్నారి అకస్మాత్తుగా నాకు మొగుడు కావాలంటూ గొడవ చేయడం ప్రారంభించింది(Little girl crying for her husband). ‘‘నా మొగుడు ఎవరు..నేను అక్కడికే వెళ్లిపోతా’’ అంటూ మారం మొదలెట్టింది. పాప అల్లరి చూసి తెగ నవ్వుకున్న ఓ పెద్దావిడ నీ మొగుడు అసలు ఎవరమ్మా అని అనునాయంగా అడిగితే మావయ్యే అంటూ చెప్పింది. మావయ్య అత్తయ్యకు భర్త, అమ్మకు నాన్న భర్త..పిన్నికి బాబాయ్ భర్త అని పాపకు నచ్చచెప్పిందా మహిళ. అంతా ఓపిగ్గా విన్న బాలిక మరి నా మొగుడు ఎవరూ అంటూ మారాం ప్రారంభించింది. నీ మొగుడు కూడా నీలాగే ఎక్కడో ఆడుకుంటూ ఉంటాడు అని చెప్పడంతో మళ్లీ పాప ఏడుపు అందుకుంది. నాకు మొగుడు కావాలంటూ పేచీ కొనసాగించింది.

బాలిక పేచీ జనాలకు తెగ నచ్చడంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా(Viral Video) మారింది. బాల్యానికి మించినది మరొకటి లేదంటూ అనేక మంది కామెంట్స్ పెడుతున్నారు.

Updated Date - 2023-09-18T20:05:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising