ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: రోజూ ట్రాఫిక్ జాం... చివరకు విసిగిపోయిన మహిళ ఏం చేసిందో తెలిస్తే..

ABN, First Publish Date - 2023-09-18T19:09:33+05:30

ట్రాఫిక్ జాంలో సమయం వృథా అయిపోతోందని భావించిన ఓ మహిళ ఈ సమస్యకు తనదైన పరిష్కారాన్ని కనుక్కోంది. ప్రతి క్షణం సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో కారులో ప్రయాణిస్తూనే కూరలు తరగడం ప్రారంభించింది. సమస్యకు తన పరిష్కారం ఇదీ అంటూ ఆమె పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరు అంటే దేశ ఐటీ రాజధాని. కానీ అక్కడ ఉండేవాళ్లకు ముందుగా గుర్తొచ్చేది ట్రాఫిక్ సమస్యలే. నిత్యం ట్రాఫిక్ జాంలతో అవస్థలు పడేవాళ్లు ఎంతో మంది తమ కష్టాలను సోషల్ మీడియాలో ఏకరవు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, కామెంట్స్ నెటిజన్లను కొన్ని సందర్భాల్లో పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తే మరికొన్ని సందర్భాల్లో ఆలోచింపచేశాయి. కానీ ట్రాఫిక్ సమస్యను తనదైన తీరులో ఎదుర్కుందో మహిళ. తాను చేసిన పని గురించి చెబుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కూడా పెట్టింది. ప్రస్తుతం ఇది నెట్టింట్లో వైరల్‌గా మారింది.


ట్రాఫిక్ సమస్యతో చాలా సమయం వృథా అయిపోతుండటంతో ప్రియ అనే మహిళ విసిగిపోయింది. చివరకు తనదైన శైలిలో పరిష్కారం కనిపెట్టింది. కారులో బయలుదేరిన ఆమె అందులో కూర్చునే కూరగాయలు తరిగింది, చిక్కుడు కాయలను వలిచింది. అందుబాటులో ఉన్న సమయంలోనూ పనులు సమర్థవంతంగా చక్కబెడుతున్నా అంటూ కామెంట్ చేసింది(Woman cutting vegetables in bengaluru traffic jam).

మహిళ ఉపాయం అనేక మందికి నచ్చడంతో నెట్టింట్లో ఈ పోస్ట్ వైరల్‌గా(Viral News) మారింది. ఇలాంటోళ్లే బెంగళూరులో బతకగలరు అంటూ కొందరు కామెంట్ చేశారు. ఇలా బయలుదేరేటప్పుడు కారులోనే హైడ్రోపోనిక్స్ విధానంలో ఓ మొక్కను పెంచడం ప్రారంభిస్తే గమ్యం చేసేసరికి అది పెరిగిపెద్దదవుతుంది’’ అని మరో వ్యక్తి సరదా కామెంట్ చేశారు.

Updated Date - 2023-09-18T19:12:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising