ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: వామ్మో.. ఇంత టాలెంట్ ఏంటి తల్లీ.. మాట్లాడేది ఇంగ్లీషే కానీ.. ఎన్ని దేశాల యాసలను టకటకా చెప్పేస్తోందో చూస్తే..!

ABN, First Publish Date - 2023-09-04T21:09:13+05:30

వివిధ దేశాలకు చెందిన ఇంగ్లీష్ భాష యాసలను స్థానికుల్లా అచ్చుగుద్దినట్టు మాట్లాడుతున్న ఓ యువతి వీడియో వైరల్‌గా మారింది. ఆమె టాలెంట్ చూసి నెటిజన్లు షాకయిపోతున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: తెలుగు భాషలో బోలెడన్ని యాసలు! స్థానికులు పలికినట్టు వాటిని యథాతథంగా పలకాలంటే కష్టమే. దక్షిణాది వారికి హిందీ వచ్చినా ఉత్తరాది వారి యాస ఒంటపట్టించుకోవడం ఓ పట్టాన సాధ్యమయ్యేది కాదు. ఇక ఇంగ్లీష్ భాష గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, స్కాట్‌ల్యాండ్, నార్తన్‌ఐర్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ..ఇలా ఒక్కో ప్రాంతంలోని వారు తమ తమ మాతృభాషల ప్రభావాలను బట్టి ఇంగ్లీష్‌ పదాలను ఒక్కో విధంగా పలుకుతూ రకరకాల యాసలకు పురుడుపోశారు. అమెరికాలోనూ వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాల యాసలు ఉన్నాయి.


ఓ ప్రాంతంలోని వారు ఇంకో ప్రాంతపు యాసలో మాట్లాడటం చాలా చాలా కష్టమైన విషయం. అలాంటిది దాదాపు పది పదిహేడు యాసల్లో ఒకే భాషను పలకడమంటే ఎంత కష్టమో ఒక్కసారి ఊహించుకోండి! అసాధ్యం అనిపిస్తోంది కదూ! అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిందో యువతి. దాదాపు పది పదిహేను దేశాల వారి ఇంగ్లీష్‌ యాసను అచ్చుగుద్దినట్టు అనుకరిస్తూ ఆమె మాట్లాడింది(Girl talks in several different english accents).


ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో బాగా వైరల్(Viral Video)అవుతూ నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. వామ్మో.. ఇంత టాలెంట్ ఏంటి తల్లీ నీకు అంటూ నోరెళ్ల బెట్టేలా చేస్తోంది. ముఖ్యంగా ఒక యాస నుంచి మరో యాసకు క్షణకాలంలో మారే సమయంలో ఆమెలో ఎటువంటి తడబాటు లేకపోవడం అనేక మందిని ఆశ్చర్యపరిచింది. ఒక దేశం పేరు చెప్పగానే టక్కున అక్కడివారి యాసను వినిపించిందా యువతి. దీంతో, నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి వాళ్లు బహు అరుదుగా మాత్రమే తారసపడతారంటూ కామెంట్స్ చేస్తున్నారు. నెటిజ్లను ఫిదా చేసిన ఈ యువతి వీడియోపై మీరూ ఓ మారు లుక్కేయండి!

Updated Date - 2023-09-04T21:13:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising