ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

King Cobra vs Small Snake: నెటిజన్లకు వణుకు పుట్టిస్తున్న వీడియో ఇది.. చిన్న పామును ఓ పెద్ద కోబ్రా నోట కరచుకుని..!

ABN, First Publish Date - 2023-09-16T16:30:36+05:30

పెద్ద పాము చిన్న పామును దారుణంగా కరుస్తూ తినేందుకు ప్రయత్నిస్తున్న షాకింగ్ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. జనాలు ఈ దృశ్యాల్ని చూసి తట్టుకోలేక కామెంట్స్ గగ్గోలు పెడుతున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో బోలెడన్ని పాము వీడియోలు నిత్యం వైరల్ అవుతుంటాయి. అవి వేటికవే ప్రత్యేకం. వాటిని చూసి గుండెజారిపోని వాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదేమో! తాజాగా అలాంటి మరో వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. నెటిజన్లకు వణుకు పుట్టిస్తోంది. ఆ భయానక దృశ్యం చూడలేకపోయామని అనేక మంది కామెంట్ పెట్టారంటే ఇది జనాల్ని ఎంతలా ప్రభావితం చేసిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.


ఈ వీడియోలో ఓ భారీ నాగుపాము మరో చిన్న పామును తినడం ప్రారంభించింది(King Cobra Eating Small Snake). ఒకరకంగా చెప్పాలంటే ఇది దారుణమైన వేట. చిన్న పామును మధ్యలో నోట కరిచి తినడం ప్రారంభించింది. అంత పెద్ద పాము ఎటాక్ చేయడంతో చిన్న పాము అసలు ఏ మాత్రం ప్రతిఘటించలేకపోయింది. తీవ్రమైన గాయం కావడంతో కదలలేని స్థితికి చేరుకుంది. చిన్న పామును మింగడానికి పెద్ద పాము ప్రయత్నించింది కానీ దాన్ని మధ్యలో కరిచిపట్టుకోవడంతో త్వరగా మింగేయడం సాధ్యపడలేదు. దీంతో, చిన్న పాముకు బతికుండగానే నరకం కనిపించింది. కానీ పామును మింగే ప్రయత్నంలో పదే పదే కోరలు దాని శరీరంలోకి దింపడాన్ని చూసి జనాలు తట్టుకోలేకపోయారు.


వీడియో కొన్ని క్షణాలే అయినా కూడా నెటిజన్లను ఇది భయభ్రాంతులకు గురి చేసింది. పాములు సాధారణంగా ఒకదాన్ని మరొకటి తినడం మామూలే. కొన్ని పాములు కడుపున పుట్టిన పిల్లల్నే తినేస్తాయి కానీ ఈ దృశ్యం మాత్రం జనాల్ని షాక్‌కు గురిచేసింది. చిన్న పాముకు బతికుండగానే నరకం కనిపించిందని అనేక మంది కామెంట్ చేశారు. ప్రకృతిలో సౌందర్యం ఓవైపు, బతుకు కోసం పోరాటం మరోవైపు..రెండూ బొమ్మా బొరుసూ లాంటివని మరికొందరు తాత్వికత వ్యక్తం చేశారు. ఇలా రకరకాల కామెంట్ల మధ్య ఈ వీడియో వైరల్‌గా(Viral Video) మారింది. మీరూ ఓ లుక్కేయండి మరి!

Updated Date - 2023-09-16T16:35:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising