ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Venkatesh Maha Viral comments: అవన్నీ పాప్‌కార్న్‌ సినిమాలే.. ‘కేజీఎఫ్‌’పై దర్శకుడు సంచలన వ్యాఖ్యలు!

ABN, First Publish Date - 2023-03-06T14:50:44+05:30

సినిమా పేరు చెప్పకుండా యశ్‌ నటించిన ‘కేజీఎఫ్‌’ చిత్రం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు ‘కేరాఫ్‌ కంచరపాలెం’ దర్శకుడు వెంకటేశ్‌ మహా.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

సినిమా పేరు చెప్పకుండా యశ్‌ నటించిన ‘కేజీఎఫ్‌’ (KGF) చిత్రం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు ‘కేరాఫ్‌ కంచరపాలెం’ (C/O kanchara palem) దర్శకుడు వెంకటేశ్‌ మహా (Venkatesh maha) ప్యాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల మన్ననలు పొందిన ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌ రూ. 1000 కోట్లు వసూళ్లు రాబట్టింది. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. అయితే టాలీవుడ్‌ దర్శకుడు వెంకటేశ్‌ మహాకు ఈ చిత్రం నచ్చలేదట. దీంతో ఈ చిత్రం పేరు చెప్పకుండా స్టోరీలైన్‌ చెబుతూ బాహాటంగానే వ్యంగాస్త్రాలు సంధించారు. (Venkatesh Maha comments on KGF)

‘‘ప్రపంచంలో ఏ తల్లైనా కొడుకు బాగుండాలని, మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటుంది. నువ్వెప్పటికేౖనా గొప్పోడివి కావాలిరా అని చెబుతుంది. అంటే బాగా సంపాదించి ఆనందంగా ఉండు.. నలుగురుకి సాయపడు అని దాని అర్థం. అయితే ఇక్కడ ఓ సినిమాలో తల్లి ఓ పెద్ద వస్తువు (బంగారం) కావాలంటుంది. ఈ హీరో వెళ్లి దాన్ని తవ్వే వాళ్లను ఉద్థరిస్తాడు. వాడు ఆ బంగారం తీసుకెళ్లి ఎక్కడో పారదొబ్బుతాడు. వాడంత పిచ్చోడు ఎవడైనా ఉంటాడా? ఆ మహాతల్లి నిజంగా ఉంటే తనను కలవాలనుంది నాకు. ఇలాంటి కథను సినిమాగా తీస్తే మనం చప్పట్లు కొడుతున్నాం. కోట్లకు కోట్లు వసూళ్లు వచ్చేలా చేస్తున్నాం. ఇప్పుడు ఏవైతే వంద కోట్లు, వెయ్యి కోట్లు వసూళ్లు రాబడుతున్నాయో.. అవన్నీ పాప్‌కార్న్‌ సినిమాలు. పాప్‌కార్న్‌(Those are popcorn movies) తింటూ వాటిని చూడొచ్చు. మధ్యలో ఓ సీన్‌ మిస్సైనా ఏం పర్లేదు అన్నట్లుగా ఉంటుంది. ఓటీటీలో చూడాల్సిన సినిమాలివి. కానీ మేము తీసినవి అలాంటివి కావు’’ అంటూ కేజీఎఫ్‌ చిత్రాన్ని విమర్శిస్తూ మాట్లాడారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. యశ్‌ ఫ్యాన్స్‌ కామెంట్‌ చేసిన దర్శకుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూన్నారు. పాన్‌ ఇండియా లెవల్‌లో హిట్టయిన సినిమా గురించి ఇంత దారుణంగా మాట్లాడుతున్నాడేంటి అని అభిమానులు మండిపడుతున్నారు. (Kgf Fans Fire on Venkatesh maha)

Updated Date - 2023-03-06T16:20:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising