యువకుడి దారుణం.. ఆర్ధరాత్రి చెల్లెలు నిద్రపోతుండగా ఆమె గదిలోకి వెళ్లి..
ABN, First Publish Date - 2023-03-05T19:04:10+05:30
సొంత చెల్లెలని కూడా కూడా దారుణానికి ఒడిగట్టిన యువకుడు.. అసలేం జరిగిందో తెలిస్తే..
ఇంటర్నెట్ డెస్క్: అర్ధరాత్రి 12 గంటలు.. ఓ యువతి తన గదిలో ఆదమరిచి నిద్రపోతోంది. ఇంతలో ఆమె అన్న చడీచప్పుడూ లేకుండా యువతి గదిలోకి ప్రవేశించారు. అతడి వెంట వరసకు మేనమామ అయ్యే వ్యక్తి, మరో బంధువు ఒకరు వెళ్లారు. ఆ తరువాత ముగ్గురూ కలిసి యువతిని దారుణంగా హత్య చేశారు. గది బయట నిలబడ్డ యువతి చెల్లెలు ఇదంతా ప్రత్యక్ష్యంగా చూసింది. ఆ తరువాత శవాన్ని ఊరిబయట నిర్మానుష్య ప్రదేశంలో తగలబెట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని(uttarpradesh) హపూర్ జిల్లాలో(Hapur district) తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా పెను కలకలానికి దారితీసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
రామ్‌పూర్ గ్రామానికి చెందిన మీనాక్షి(23) డిగ్రీ చదువుతోంది. తన అన్న, చెల్లితో కలిసి నివసిస్తోంది. ఆమె తల్లిదండ్రులు 15 ఏళ్ల క్రితమే చనిపోయారు. కాగా.. మీనాక్షి కొంత కాలం క్రితం ఓ యువకుడితో ప్రేమలో పడింది(Love). అతడినే పెళ్లి చేసుకునేందుకు నిర్ణయించుకుంది. అయితే.. మీనాక్షి అన్న మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. మరో కులం వ్యక్తిని పెళ్లి చేసుకుంటే గ్రామంలో తమ పరువు పోతుందంటూ నిత్యం గొడవపడేవారు. చివరకు విషయం గ్రామ పెద్దల దృష్టికి వెళ్లింది. దీంతో.. మీనాక్షి తన ప్రేమ వ్యవహారానికి ముగింపు పలుకుతానని పెద్దలకు మాటిచ్చింది. కానీ.. ఆ తరువాత యథావిధితా యువకుడితో తన బంధాన్ని కొనసాగించింది. ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కు తనకు ఉందని తేల్చి చెప్పింది.
దీంతో ఆ కుటుంబంలో గొడవలు పెద్దవయ్యాయి. ఇటీవల ఓ రాత్రి మీనాక్షి తన గదిలో నిద్ర పోతుండగా ఆమె అన్నయ్య మరో ఇద్దరు బంధువులతో కలిసి హత్య చేశాడు(Brother ends sister's life). ఆ తరువాత ఆమె తన ప్రియుడితో పారిపోయిందంటూ గ్రామస్తులను నమ్మించే ప్రయత్నం చేశారు. విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారు కుటుంసభ్యులనూ ప్రశ్నించారు. ఈ క్రమంలో.. అన్న చేసిన పనిని కళ్లారా చూసిన మీనాక్షి చెల్లెలు పోలీసులకు అంతా పూస గుచ్చినట్టు చెప్పింది. దీంతో..వారు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Updated Date - 2023-03-05T19:05:15+05:30 IST