ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Lion Crocodile Fight: రెండు సింహాలతో ఓ మొసలి ఫైటింగ్.. చనిపోయిన దున్నపోతు మాసం కోసం పెద్ద యుద్ధమే జరిగిందిగా..!

ABN, First Publish Date - 2023-07-21T17:50:55+05:30

దున్నపోతు కళేబరం మొసలికి చిక్కుకుండా రెండు సింహాలు పెద్ద వ్యూహమే పన్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఇంటర్నెట్ డెస్క్: అడవిలో ఏదైనా జంతువు కళేబరం కనిపిచ్చిందంటే చాలు క్రూరమృగాలన్నీ అక్కడ వాలిపోతాయి. మొదట అక్కడ దిగేది రాబందులే. వాటి టైం బాగుంటే కళేబరం మొత్తం వాటి సొంతమవుతుంది. లేకపోతే పెద్ద జీవులొచ్చి దాన్ని ఖాళీ చేస్తాయి. అయితే, ఈసారి ఆఫ్రికాలో ఇలాంటి ఓ దృశ్యం కనిపించింది. టూరిస్టులు దాన్ని కెమెరాలో బంధించి యూట్యూబ్‌లో పెట్టడంతో తెగ వైరల్(Viral Video) అవుతోంది.

ఇంతకీ ఏం జరిగిందంటే, నది ఎండిపోవడంతో అడుగున ఉన్న నేల మొత్తం బయటపడింది. అక్కడే ఓ దున్నపోతు కళేబరం, దాన్ని ఏ జంతువు చంపిందో తెలీదు గానీ ఆ కళేబరం మాత్రం తొలుత ఓ మొసలి పాల పడింది. రిస్క్ లేకుండా ఫుడ్ దొరికినందుకు అది తెగ ఎంజాయ్ చేస్తుండగా సీన్‌లోకి రెండు సింహాలు ఎంట్రీ ఇచ్చాయి(Lions steal buffalo carcass from Crocodile).

మొసలితో ప్రమాదం ఉందని సింహాలకు తెలుసు. కానీ ఫ్రీగా వస్తున్న ఆహారాన్ని అవి కూడా చూస్తూ చూస్తూ వదులుకోలేవు. అందుకే మొసలికి తమదైన శైలిలో చుక్కలు చూపించాయి. మొసలి ముందు ఓ సింహం నిలబడి దాని దృష్టిని ఆకర్షించేందుకు ట్రై చేస్తే రెండో సింహం వెనుక నుంచి దాడి చేసింది. ఇలా దాన్ని కన్‌ఫ్యూజ్ చేసి అటాక్ చేస్తూ భయపెట్టేశాయి. మొసలి కూడా సింహాలను ఎదుర్కొనేందుకు విశ్వప్రయత్నం చేసింది. వాటి మధ్య భీకరపోరు జరిగింది. కానీ, ముప్పెట దాడితో మొసలి భయపడి సైడైపోవడంతో సింహాలు చివర్లో ఎంచక్కా ఫుడ్ ఎంజాయ్ చేశాయి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Updated Date - 2023-07-21T17:50:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising