ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Tomatoes: ట‘మాటలు’ కాదు... ఈ విషయాలు తెలిస్తే అవాక్కవుతారు..

ABN, First Publish Date - 2023-07-30T16:22:49+05:30

టమాటా... టమాటా... ప్రస్తుత మన ప్రపంచం టమాటా చుట్టే తిరుగుతోంది. సగటు భారతీయులు షేర్‌మార్కెట్‌ పెరిగినా, పడిపోయినా పెద్దగా పట్టించుకోరు కానీ... ఉల్లిగడ్డ, టమాటాల రేట్లు పెరిగితే వంటింట్లో మంటలు రేగుతాయి. ప్రస్తుతం టమాటాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అత్యంత ఖరీదైన కూరగాయగా కిరీటం ధరించిన టమాటాపై అందుకే రోజూ చిత్ర విచిత్రమైన, వింతైన వార్తలు వెలువడుతున్నాయి. తాజాగా టమాటా చేయిస్తున్న విన్యాసాలివి...

టమాటా... టమాటా... ప్రస్తుత మన ప్రపంచం టమాటా చుట్టే తిరుగుతోంది. సగటు భారతీయులు షేర్‌మార్కెట్‌ పెరిగినా, పడిపోయినా పెద్దగా పట్టించుకోరు కానీ... ఉల్లిగడ్డ, టమాటాల రేట్లు పెరిగితే వంటింట్లో మంటలు రేగుతాయి. ప్రస్తుతం టమాటాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అత్యంత ఖరీదైన కూరగాయగా కిరీటం ధరించిన టమాటాపై అందుకే రోజూ చిత్ర విచిత్రమైన, వింతైన వార్తలు వెలువడుతున్నాయి. తాజాగా టమాటా చేయిస్తున్న విన్యాసాలివి...

ఫ్రీ... ఫ్రీ...

ఇంటి ముందు ఎక్కితే గమ్యం ముందు దించే ఆటోల్లో ప్రయాణం ఎప్పటికీ సౌఖ్యమే. కాకపోతే మీటర్‌ రేటు కాకుండా తమ ఇష్టానుసారం తీసుకునే ఆటో డ్రైవర్ల వల్లే కష్టాలు. అందుకే ఓలా, ర్యాపిడోల్లో ఆటో బుకింగ్స్‌ ఎక్కువయ్యాయి. అయితే చండీగఢ్‌కి చెందిన ఆటోడ్రైవర్‌ అరుణ్‌ మాత్రం సమయానుకూలంగా తన ఆటోలో ప్రయాణిస్తే కిలో టమాటాలు ఉచితంగా ఇస్తానని ప్రకటించాడు. పైగా ఆటో వెనక ఓ బోర్డు పెట్టి తన గొప్ప మనసు చాటుకున్నాడు. అయితే ఇందులో ఓ కండిషనూ లేకపోలేదండోయ్‌... అయిదుసార్లు తన ఆటోలో ప్రయాణిస్తేనే ఈ ఆఫర్‌ వర్తిస్తుందని అంటున్నాడు అరుణ్‌. కిలో టమాటాల కోసం ఆ మాత్రం సాహసం చేయకపోతే ఎలా?

కొత్త బంగారం

ఉర్ఫి జావెద్‌... ఈ పేరు సంచలనానికి మరో పేరు. అనునిత్యం వివిధ ఫొటోలు, వీడియోలతో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోన్న బాలీవుడ్‌ సుందరి. పెరుగుతోన్న రేట్లకు కవ్వింపుగా టమాటాలను చెవి పోగులుగా ధరించి అందరినీ ఆశ్చర్యపరచింది. చెవి పోగులతో పాటు ఓ చేతిలో టమాటాను ఆరగిస్తూ ఉర్ఫి ఇన్‌స్టాలో షేర్‌ చేసిన వీడియో వైరల్‌గా మారింది. ‘న్యూ గోల్డ్‌’ అని టమాటాలకు ఈ అమ్మడు కొత్త పేరు కూడా పెట్టేసింది.

పోలీసు పహారా

టమాటా లారీకి గస్తీ కాయాల్సి వస్తుందని ఏ పోలీసు ఊహించి ఉండడు. కానీ ఆకాశాన్నంటిన టమాటా ధరల వల్ల అలాంటి పహారా కూడా పోలీసులు చేయాల్సి వచ్చింది. కర్ణాటకలోని కోలార్‌ నుంచి న్యూదిల్లీకి టమాటా లారీ బయల్దేరింది. నేషనల్‌ హైవే 44 మీద అంటే ఆదిలాబాద్‌లోని మావల గ్రామం సమీపంలో ప్రమాదానికి గురై ట్రక్కు బోల్తా పడింది. హైవే పెట్రోలింగ్‌ పోలీసులకు విషయం తెలియడంతో వెంటనే వచ్చేశారు. ఆ లారీలో మొత్తం 18 టన్నులు... అంటే అక్షరాలా 22 లక్షల రూపాయల విలువ చేసే టమాటాలు ఉన్నాయి. అందులో ఇరవై శాతం టమాటాలు కిందపడటంతో దెబ్బతిన్నాయి. మిగతా వాటినైనా రక్షించుకోవాలనే ఉద్దేశంతో ఆ యజమాని పోలీసులను ఆశ్రయించాడు. టమాటాలన్నీ అక్కడి నుంచి వెళ్లే వరకు పోలీసులు గస్తీ కాశారు. రోడ్డు మీద పడ్డ కొన్ని టమాటాలనైనా తీసుకుపోదాం అనుకున్న వాళ్లు కూడా పోలీసుల పహారాతో ప్రయత్నాన్ని విరమించుకున్నారట.

ఆ ఒక్కటీ తప్ప

మునుపెన్నడూ లేనంతగా టమాటా ధరలు ఒక్కసారిగా 400 శాతాన్ని మించి పోయాయి. అకాల వర్షాలు, తగినంత దిగుబడి లేకపోవడం వల్ల టమాటాల ధరలు పెరిగాయని ప్రభుత్వం చెబుతోంది. ఏదైతేనేం గృహిణులు నేడు ఇళ్లలో టమాటా లేని వంటల్ని చేయడం అలవరచుకుంటున్నారు. టమాటా పప్పు, చట్నీ, పచ్చడి, చారు... ఇవన్నీ ఇళ్లల్లో కనిపించడం తగ్గింది. సాధారణ గృహిణులే కాదు... మెక్‌డొనాల్డ్స్‌ లాంటి దిగ్గజాలు కూడా టమాటాల విషయంలో ఒకసారి ఆలోచిస్తున్నాయి. మెనూలో నుంచి టమాటాను తీసేస్తున్నామని మెక్‌డొనాల్ట్స్‌ సంస్థ వెల్లడించింది. మార్కెట్లో నాణ్యమైన టమాటాలు లేకపోవడం వల్లే ఇలా చేస్తున్నామని ప్రకటించింది. ఇది ఇండియాలో మాత్రమే అని వేరే చెప్పక్కర్లేదు.

కోటీశ్వరుడు

టమాటా సాగు కత్తి మీద సాము లాంటిదే. ఓ ఏడాది ధర పలుకుతుంది. మరో ఏడాది గిట్టుబాటు ధరలు లేక రోడ్డు మీద పారబోస్తారు రైతులు. అయితే ఈ ఏడాది అనూహ్యంగా టమాటా ధరలు రూ.150 నుంచి రూ.200 పలకడంతో రైతుల పంట పండిందనే చెప్పాలి. టమాటా రైతుల్లో విశేషంగా శీర్షికలెక్కింది ఈశ్వర్‌ గైకార్‌. పుణెకు చెందిన ఈ రైతుకు 16 ఎకరాల భూమి ఉంది. అందులో 12 ఎకరాల్లో టమాటానే పండిస్తున్నాడు. టమాటా రేట్లు ఆకాశాన్ని తాకడంతో ఒక్క నెలలోనే 3 కోట్ల రూపాయలు సంపాదించాడు ఈశ్వర్‌. మే నెలలో కూడా గిట్టుబాటు ధర లేక చాలా టమాటాలను పడేయాల్సి వచ్చిందట. కానీ జూన్‌ 11 నుంచి అతడి అదృష్టం ఒక్కసారిగా మారిపోయింది.

పుట్టినరోజు కానుక

ఇంట్లో పాప పుట్టినరోజు. స్నేహితులు అందరినీ పిలిచి కేక్‌ కట్‌ చేయడం సాధారణంగా అందరూ చేసేది. కొంతమంది అనాథ శరణాలయాలకు, వృద్ధాశ్రమాలకు వెళ్లి వేడుక జరుపుకుంటారు. ఇంట్లో లేదా గుళ్లలో అన్నదానం చేస్తుంటారు మరికొందరు. అయితే హైదరాబాద్‌లోని పంజాగుట్టకు చెందిన నల్ల శివ తన కుమార్తె చైతన్య జన్మదినం సందర్భంగా 400 కిలోల టమాటాలను అందరికీ పంచిపెట్టారు. వారిలో పేద, మధ్య తరగతి వారే ఎక్కువగా ఉండడం విశేషం. నల్ల శివ కుటుంబానికి వారి చల్లని టమాటా దీవెనలు కచ్చితంగా అందే ఉంటాయి.

నెంబర్‌వన్‌

టమాటాలని ఇష్టపడని దేశాలు తక్కువే. పిజ్జాలు, సాస్‌లు, కెచప్‌లు, పచ్చడి, పప్పు, కూరలు, సూప్‌... తదితర రూపాల్లో అనేక దేశాలు నిత్యం వినియోగిస్తూనే ఉన్నాయి. అయితే ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా టమాటాలను పండిస్తోన్న దేశం చైనా. ఆ తరవాతి స్థానాల్లో భారతదేశం, యుఎస్‌ఏ ఉన్నాయి. చైనాకు సంబంధించి మరో విశేషమూ ఇక్కడ చెప్పుకోవాలి. అత్యధికంగా వినియోగించే దేశాల జాబితాలో కూడా మొదటి స్థానం ఆక్రమించింది. ప్రపంచ టమాటాల్లో 30 శాతం చైనానే పండిస్తోంది.

విషపు ఆపిల్‌

ఇప్పుడంటే మనకు టమాటా లేకుండా కూర ఉండట్లేదు కానీ యూరోపియన్లను మాత్రం రెండు వందల ఏళ్లకు పైగా భయపెట్టిందట టమాటా. ఇది క్రీ.శ.17వ శతాబ్ది నాటి మాట. దక్షిణ అమెరికా దేశాల నుంచి దిగుమతైన జాతి మొక్క టమాటా. అప్పట్లో యూరప్‌లో అంతగా సాగు చేసేవారు కాదు. సంపన్న కుటుంబాలకు మాత్రమే అందుబాటులో ఉండేది. అదేమి విచిత్రమో కానీ టమాటాను ఆరగించిన వాళ్లు జబ్బునపడేవాళ్లట. ఆ తరవాత మరణించేవారట. ఇలా ఒక్క ఇంట్లో కాదు చాలామంది ఇళ్లలో జరిగింది. అందుకే ‘పాయిజన్‌ ఆపిల్‌’ అనే పేరు టమాటాకు వచ్చింది. దాన్ని చూడటం కాదు తాకాలన్నా భయపడే కాలం అది. అందుకే నిషేఽధించారు. కేవలం చూడచక్కని పండుగా రాజ కుటుంబాల్లో పెంచేవారని ఆనాటి చారిత్రక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అయితే సంపన్నుల మరణానికి కారణం టమాటాలు కాదు... వాళ్లు భోంచేసే పళ్లాలు అని తరవాతి కాలంలో తెలిసింది. సీసం పాళ్లు ఎక్కువగా ఉన్న భోజన పళ్లేలలో టమాటాలను పెట్టగానే సీసంతో ప్రతిచర్య కారణంగా విషంగా మారేవట. దాని వల్లే అస్వస్థత, ఆ తరవాత మరణం సంభవించేది. అయితే క్రీ.శ. 1880లో ఇటలీ లోని నేపుల్స్‌లో పిజ్జా కనుగొనడం వల్ల యూరప్‌లో టమాటా పంట పండింది. అ తరవాతి కాలంలో యూరప్‌, అమెరికాల్లో ‘గోల్డెన్‌ ఆపిల్‌, ‘లవ్‌ ఆపిల్‌’ అనే పేర్లూ టమాటాకి వచ్చేశాయి.

Updated Date - 2023-07-30T17:43:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising