ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

World's Oldest Bodybuilder: ముసలోడే కానీ.. మహానుభావుడంటే ఇతడే.. కుర్రాళ్లకు కూడా సాధ్యం కాని ఫిట్‌నెస్..!

ABN, First Publish Date - 2023-07-21T18:29:10+05:30

అమెరికాకు చెందిన జిమ్ ఆరింగ్టన్ తొంభై ఏళ్ల వయసులోనూ జిమ్ చేస్తుంటారు. కండలు తిరిగిన దేహధారుఢ్యం ఆయన సొంతం. 2015లో ఆయన అత్యంత వృద్ధ బాడీబిల్డర్‌గా రికార్డులకెక్కారు.

ఇంటర్నెట్ డెస్క్: ముసలోడే కానీ.. మహానుభావుడు.. ఇది ఓ తెలుగు సినిమాలో పాప్యులర్ డైలాగ్. కానీ ఈ డైలాగ్‌కు సరిగ్గా సరిపోయే వ్యక్తి మాత్రం అమెరికాలో ఉన్నారు. సిక్స్ ప్యాక్‌తో కూడిన కండలు తిరిగిన దేహం కోసం కుర్రాళ్లు కూడా కష్టపడి కాడి పక్కనపడేస్తుంటారు. అలాంటిది పెద్దాయన మాత్రం కండలు బాడీతో ఏకంగా గిన్నిస్ బుక్‌లో చోటు దక్కించుకున్నాడు. ఆయన ఏ అరవైయ్యో, డబ్భైయ్యో ఉంటారనుకుంటే మీరు పొరబడినట్టే. ఆయనకు ప్రస్తుతం తొంభై ఏళ్లు దాటినా ఈ వయసులో కూడా ఇటీవలే ఓ కాంపిటీషన్‌లో బహుమతి గెలుచుకున్నారు.

ఇలా జనాలతో మహానుభావుడు అనిపించుకుంటున్న ఈ పెద్దాయన పేరు జిమ్ ఆరింగ్టన్(Jim Arrington). 2015లో ఆయన అత్యంత వృద్ధ బాడీ బిల్డర్‌గా గిన్నిస్‌ బుక్‌లో(Guinness book of world records) చోటు సంపాదించారు(Worlds oldest body builder). ఇప్పుడాయన వయసు తొంభై. ఇటీవలే నెవాడాలో జరిగిన ఓ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్‌లో 80 ఏళ్ల పైబడ్డ వారి కేటగిరీలో మొదటి స్థానంలో నిలిచారు. 70 ఏళ్లు పైబడ్డ వారి కేటగిరీలో మూడో స్థానం దక్కించుకున్నారు.

జిమ్ ఆరింగ్టన్ చిన్నప్పటి నుంచీ బాహుబలి ఏమీ కాదు. వాస్తవానికి ఆయన నెలలు నిండకుండానే పుట్టాడు. ఆపై చాలా కాలం పాటు ఆయనను ఆస్తమా వేధించేది. దేహధారుఢ్యం పెంపొందించుకుంటే ఈ సమస్యల నుంచి బయటపడొచ్చని చిన్నతనంలోనే తెలుసుకున్న ఆయన ఆ తరువాత వెనక్క తిరిగి చూసుకోలేదు. ఎక్సరసైజులు గట్రా చేస్తూ మంచి ఫిజిక్ బిల్డ్ చేసుకున్నారు. ఇప్పటికీ ఆయనది అదే తీరు. యువతకు కూడా సాధ్యాం కాని రీతిలో ఆయన ఈ వయసులో కూడా కండలు తిరిగిన దేహాన్ని మెయింటేన్ చేస్తున్నారు. పెద్దాయన నిజంగా మహానుభావుడే.!

Updated Date - 2023-07-21T18:40:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising