ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డ్రైవర్ లేకుండానే అర కిలోమీటరు వెళ్లిపోయిన లారీ.. అసలేం జరిగిందంటే..

ABN, First Publish Date - 2023-01-15T16:47:54+05:30

రాజస్థాన్‌లోని నాగౌర్‌లో ఓ లారీ బీభత్సం సృష్టించింది.. డ్రైవర్ లేకుండా ఏకంగా అర కిలోమీటరు దూరం ప్రయాణించి రెండు బైక్‌లను, మూడు కార్లను ఢీకొట్టింది.. రోడ్ల మీద జనం షాపుల్లోకి ప్రవేశించి ప్రాణాలు కాపాడుకున్నారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజస్థాన్‌లోని (Rajasthan) నాగౌర్‌లో ఓ లారీ బీభత్సం సృష్టించింది.. డ్రైవర్ లేకుండా ఏకంగా అర కిలోమీటరు దూరం ప్రయాణించి (Lorry ran 500 meters without a driver) రెండు బైక్‌లను, మూడు కార్లను ఢీకొట్టింది.. రోడ్ల మీద జనం షాపుల్లోకి ప్రవేశించి ప్రాణాలు కాపాడుకున్నారు.. దీంతో ఎలాంటి ప్రాణ నష్టమూ జరగలేదు.. సమాచారం అందుకున్న పోలీసులు ఆ లారీని సీజ్ చేసి డ్రైవర్ కోసం అన్వేషణ సాగిస్తున్నారు.

నాగౌర్ నుంచి కూచమన్ సిటీకి వెళ్తున్న లారీ బ్రేకులు నగరంలోకి రాగానే ఫెయిలయ్యాయి. విషయం తెలుసుకున్న డ్రైవర్ కిందకు దూకేసి తన ప్రాణాలను కాపాడుకున్నాడు. డ్రైవర్ లేకుండానే ఆ లారీ రోడ్డుపై పరుగులు తీసింది. ఏకంగా 500 మీటర్లు ప్రయాణించింది. రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న థార్, బ్రెజా, క్రెటా కార్లను ఢీకొట్టడంతో అవి ధ్వంసమయ్యాయి. రెండు బైక్‌లు కూడా నుజ్జునుజ్జయిపోయాయి. రోడ్డుపై అడ్డదిడ్డంగా వస్తున్న లారీని చూసి జనం పరుగులు పెట్టారు. షాపుల్లోకి, బస్ స్టాప్‌ల్లోకి వెళ్లి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. చివరకు ఆ లారీ ఓ డివైడర్‌ను ఢీకొట్టి ఆగిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆ లారీని సీజ్ చేసి డ్రైవర్ కోసం అన్వేషణ సాగిస్తున్నారు.

Updated Date - 2023-01-15T16:47:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising