ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్మికులతో రోజుకు 18 గంటల గొడ్డు చాకిరీ.. దీనిని నిరసిస్తూ మొదలైన ఉద్యమాలు.. నేటి ‘మే డే’కు దారితీశాయిలా...

ABN, First Publish Date - 2023-05-01T10:57:36+05:30

నేడు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం. దీనినే ‘మే డే’(May Day) అని అంటారు. అమెరికాలో ‘లాయల్టీ డే’ గా చెబుతారు. పలు దేశాల్లో మే డేని సెలవు దినం(holiday)గా ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేడు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం. దీనినే ‘మే డే’(May Day) అని అంటారు. అమెరికాలో ‘లాయల్టీ డే’ గా చెబుతారు. పలు దేశాల్లో మే డేని సెలవు దినం(holiday)గా ప్రకటించారు. అయితే ఈ కార్మిక దినోత్సవం ఏ ఒక్క ప్రాంతానికో, దేశానికో, సంఘటనకో పరిమితం కాలేదు. శ్రమదోపిడిని(Exploitation) నిరసిస్తూ ప్రపంచవ్యాప్త కార్మికుల్లో స్పూర్తిని రగిలించిన తొలి అడుగే ‘మే డే’.

అలా మొదలయ్యింది..

19వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం(industrial revolution) ఫలితంగా అమెరికా, ఐరోపాలలో లెక్కకుమించి భారీ పరిశ్రమలను ఏర్పాటయ్యాయి. అయితే ఈ పరిశ్రమలలో గాలి, వెలుతురు ఉండేదికారు. అలాగే కనీస సౌకర్యాలు(Minimum facilities) కూడా లేకుండా రోజుకు 16 నుంచి18 గంటలు పాటు కార్మికులతో గొడ్డు చాకిరీ చేయించేవారు. ఇటువంటి యాజమాన్యపు తీరును నిరసిస్తూ 1886లో చికాగో(Chicago)లోని హే మార్కెట్‌లో చోటుచేసుకున్న కార్మికుల నిరసన ప్రదర్శనే ఈ ‘మే డే’ పుట్టకకు నాందీ బీజం వేసింది.

ఉద్యమం సాగిందిలా..

1884లో రోజుకి 8 గంటల పనివేళలు మాత్రమే ఉండాలని కార్మికులు తొలిసారిగా ఆందోళన ప్రారంభించారు. రెండేళ్లలో అంటే 1886 నాటికి ఈ నిరసన(protest) తారాస్థాయికి చేరుకుంది. కార్మికులంతా సమ్మె బాటపట్డారు. 1886 మే 1న 40 వేల మంది కార్మికులు సమ్మె మొదలు పెట్టారు. మే 3 నాటికి ఆందోళనకు దిగిన కార్మికుల(workers) సంఖ్య లక్షకు చేరుకుంది. సమ్మె ఉధృతం కావడంతో యాజమాన్యాలు పోలీసుల సాయం తీసుకుని, వారిని కార్మికులపైకి ఉసిగొల్పాయి. ఈ సమయంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో(firing) ఇద్దరు కార్మికులు మరణించారు. ఫలితంగా అగస్ట్ స్పైస్, పార్సన్స్, క్లోరిన్ మోస్ట్ లూయీస్ లింగ్ అనే కార్మిక నేతల ఆధ్వర్యంలో ఒక పారిశ్రామిక సంస్థ ముందు భారీ ప్రదర్శన జరిగింది. శాంతియుతంగా జరుగుతున్న ఈ ప్రదర్శనపై మే 4న తిరిగి పోలీసులు(police) కాల్పులు జరపడంతో 8 మంది మరణించారు. 40 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో మరో ఏడుగురు చికిత్స పొందుతూ చనిపోయారు. అయితే ఈ కాల్పులకు కార్మిక నేతలే కారణమని వారిని అరెస్ట్ చేశారు. 1887లో వీరికి ఉరిశిక్ష(hanging) అమలు చేశాయి. దీనిని వ్యతిరేకిస్తూ మరో కార్మిక నాయకుడు లూయీస్ లింగ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఉదంతాన్ని ‘హే మార్కెట్ దారుణ హత్యాకాండ’ గా చరిత్రకారులు వర్ణిస్తారు.

మే 1 ప్రాముఖ్యత ఇదే..

అనంతర కాలంలో 1889 నుంచి 1890 వరకు అనేక దేశాల్లో అనేక కార్మిక ఉద్యమాలు(Labor movements), నిరసన ప్రదర్శనలూ జరిగాయి. 1890, మే 1న బ్రిటన్‌లోని హైడ్ పార్క్‌లో నిర్వహించిన నరిసన ప్రదర్శనలో దాదాపు 3 లక్షల మంది కార్మికులు పాల్గొన్నారు. రోజుకు 8 గంటలు మాత్రమే పనివేళలు(working hours) ఉండాలన్నదే ఆ ప్రదర్శనలో పాల్గొన్న వారి మఖ్యమైన డిమాండ్. తదుపరి కాలంలో అనేక ఐరోపా దేశాల్లో ఈ నినాదంతోనే అనేక ఆందోళనలు జరిగాయి. కాగా షికాగోలో జరిగిన నిరసన ప్రదర్శనలో మరణించినవారికి వారికి గుర్తుగా మే 1ని కార్మిక దినోత్సవంగా జరుపుకోవాలన్న ఒప్పందం కుదిరింది.

ప్రపంచ దేశాల్లో..

ప్రపంచవ్యాప్తంగా మే డే వేడుకలు పలు రకాలుగా జరుగుతుంటాయి. అనేక దేశాల్లో ఆ రోజున పోరాటాలూ, నిరసన ప్రదర్శనలూ నిర్వహిస్తుంటారు. ప్రపంచంలోని కొందరు మహనీయులు తమ రక్తాన్ని చిందించి కొన్ని రోజులను చారిత్రాత్మక చిరస్మరణీయ దినాలుగా మారుస్తారు. వాటిలో ఒకటిగా నిలిచిన మే డే ఒక చారిత్రాత్మక చైతన్య దినం అని చెబుతారు. చికాగో(Chicago)లోని కొందరు కార్మిక వీరులు రక్తతర్పణం చేసి, ప్రపంచ కార్మికవర్గానికి కొత్త వెలుగును అందించారు. తమ శ్రమను యాజమాన్యాలు పరిధికి మించి దోచుకున్న సమయంలో తామూ మనుషులమే నని, తమ శక్తికి కూడా కొన్ని పరిమితులుంటాయని గొంతెత్తి చెప్పారు. ఇటువంటి చాకిరీ తామిక చేయలేమంటూ పనిముట్లు కింద పడేసి 8 గంటల పని వేళల కోసం నినదించి, చివరకు ప్రాణాలను సైతం అర్పించారు. రోజులో ఉన్న 24 గంటలలో 8 గంటలు పని, 8 గంటలు విశ్రాంతి(rest), మరో 8 గంటలు రిక్రీయేషన్‌ అనేవి ఈ పోరాటం ద్వారా కార్మికులు సాధించుకున్నారు. ఇది పారిశ్రామిక యుగం ఏర్పడిన తర్వాత చోటుచేసుకున్న అతిపెద్ద మార్పుగా చెబుతారు.

హిట్లర్ పాలనలో..

1900 నుంచి 1920 వరకూ ఐరోపా(Europe)లోని ప్రభుత్వ, ధనిక వ్యాపారుల దోపిడీ చర్యలను ఎండగడుతూ సోషలిస్టు పార్టీల ఆధ్వర్యంలో మే ఒకటిన నిరసన ప్రదర్శనలు(Protest demonstrations) జరిగేవి. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో మే డే నాడు యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలు నిర్వహించేవారు. తరవాతి కాలంలో మే ఒకటిని నాజీల వ్యతిరేక దినోత్సవంగా.. హిట్లర్ పాలనలో ఆ రోజును జాతీయ కార్మికుల దినోత్సవంగా జరుపుకునేవారని చరిత్ర చెబుతోంది.

భారతదేశంలో..

చికాగోలో జరిగిన ఆందోళనకు ముందుగానే మనదేశంలోని కలకత్తాలో కార్మికులు నిర్ణీత పనిగంటల కోసం హౌరా రైల్వేస్టేషన్‌(Howrah Railway Station)లో 1862లో సమ్మె చేపట్టారు. 1923లో భారత్‌లో తొలిసారిగా ‘మే డే’ నిర్వహించారు. 1920లో ట్రేడ్‌ యూనియన్‌ ఏర్పడటంతో కార్మికవర్గాల్లో మరింత చైతన్యం వచ్చింది. అనంతరం ప్రతీయేటా ‘మే డే’ను నిర్వహిస్తున్నారు. కాగా రెండో ప్రపంచ యుద్ధం(Second World War) తరవాత ఐరోపా దేశాల్లో మే 1ని సెలవు దినంగా తీర్మానించారు. అనేక దేశాలు ఇదే బాటలో నడిచాయి. పలు దేశాల్లో కార్మికులకు సంబంధించిన అనేక సంక్షేమ పథకాలు ఆ రోజు నుంచే అమల్లోకి వచ్చాయి. అయితే 1985 అనంతరం చోటుచేసుకున్న ప్రైవేటైజేషన్‌(Privatization), లిబరలైజేషన్‌, గ్లోబలైజేషన్‌ పరిణామాల నేపధ్యంలో అసంఘటిత కార్మికరంగంలో కార్మిక చట్టాలు(Labor laws) అమలుకు నోచుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2023-05-01T11:02:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising