ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral News: ఇది నా కుర్చీ.. అంటూ ఆఫీసుల్లో కొలీగ్స్‌తో పోట్లాడుతుంటారా..? విసుగొచ్చి ఓ ఉద్యోగి ఎంత పని చేశాడంటే..!

ABN, First Publish Date - 2023-03-30T20:56:08+05:30

హరియాణాలోని గురుగ్రామ్‌లో తాజాగా ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. కుర్చీల కోసం ఇద్దరు ఉద్యోగుల మధ్య తలెత్తిన వివాదం చివరకు కాల్పులకు దారి తీసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఇంటర్నెట్ డెస్క్: ఆఫీసుల్లో కుర్చీల కోసం ఉద్యోగుల మధ్య వాదులాటలు సహజమే. ఈ కూర్చీ నాది అంటే నాది అంటూ గొడవలు పడటం, శత్రుత్వం పెంచుకోవడం, అవతలివారు కనిపనిస్తే చాలు ముఖం తిప్పుకోవడం.. ఇలాంటి దృశ్యాలు మనమందరం చూసే ఉంటారు. అయితే..ఇలా గొడవపడేవారు చాలా సందర్భాల్లో సద్దుకుపోతుంటారు. గొడవ పెద్దది చేసుకునేందుకు ఇష్టపడరు.

కానీ.. హరియాణాలోని గురుగ్రామ్‌లో(Gurugram) తాజాగా ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. కుర్చీల కోసం ఇద్దరు ఉద్యోగుల మధ్య తలెత్తిన వివాదం చివరకు కాల్పులకు దారి తీసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..అమన్, విశాల్ అనే ఇద్దరు యువకులు ఒకే ఆఫీసులో పనిచేస్తున్నారు. మంగళవారం వారి మధ్య ఓ కుర్చీ విషయంలో వివాదం తలెత్తింది(Fight Over Chair). అయితే.. బుధవారం కూడా వారు ఈ విషయంలో మరోసారి తగవు పడ్డారు. వివాదం పెద్దదై చివరకు చిలికిచిలిక గాలివానగా మారింది.

ఈ క్రమంలోనే విశాల్ కార్యాలయం నుంచి బయటకు వెళ్లిపోయాడు. అమన్ కూడా అతడి వెనకాలే బయటకు వచ్చాడు. విశాల్ వీధిలో నడుచుకుంటూ వెళుతుండగా వెనక నుంచి అతడిని సమీపించిన అమన్ ఒక్కసారిగా కాల్పులకు తెగబడి అక్కడి నుంచి పారిపోయాడు(Youth shot colleague). ఈ సమాచారం అందగానే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. బాధితుడి సోదరుడి ఫిర్యాదు మేరకు అమన్‌పై హత్యాయత్నం సెక్షణ్ కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. ఈ ఉదంతం స్థానికంగా కలకలానికి దారి తీసింది.

Updated Date - 2023-03-30T20:56:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising