ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాధారణ దగ్గు, టీబీతో వచ్చే దగ్గుకు తేడాలివే.. ఎలా సులభంగా గుర్తించవచ్చంటే...

ABN, First Publish Date - 2023-02-25T06:55:07+05:30

మనలో చాలామంది సాధారణ దగ్గును కూడా టీబీ సంబంధిత దగ్గుగా భావిస్తుంటారు. అందుకే ప్రతీ ఒక్కరూ సాధారణ దగ్గు, టీబీతో వచ్చే దగ్గుకు మధ్యగల తేడాలను తెలుసుకోవాలి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనలో చాలామంది సాధారణ దగ్గును కూడా టీబీ సంబంధిత దగ్గుగా భావిస్తుంటారు. అందుకే ప్రతీ ఒక్కరూ సాధారణ దగ్గు, టీబీతో వచ్చే దగ్గుకు మధ్యగల తేడాలను తెలుసుకోవాలి. దగ్గుతున్న స్థితిని చూసి అది ఏ రకమైన దగ్గో ఇట్టే గుర్తించవచ్చు. ఇప్పుడు మనం సాధారణ దగ్గు, టీబీ దగ్గు మధ్యగల తేడాలను తెలుసుకుందాం.

1 టీబీతో వచ్చే దగ్గు అంటే క్షయవ్యాధి సంబంధితమైనది. కఫం, దగ్గు ఈ వ్యాధి లక్షణాలలో ముఖ్యమైనవి. ఎవరైనా సరే వారానికి మించి ఎక్కువ రోజులు దగ్గుతో బాధపడుతున్నట్లయితే దానిని నిర్లక్ష్యం చేయకూడదు. అది క్షయవ్యాధి సంబంధిత దగ్గు అయ్యేందుకు అవకాశాలున్నాయి.

2 ఎవరికైనా ఉదయాన్నే కఫంతో పాటు దగ్గు వస్తూ ఉండి, ఇది 15 రోజులకు మంచి వస్తూ ఉంటే అది టీబీకి సంకేతం కావచ్చని నిపుణులు చెబుతున్నారు.

3 ఎవరికైనా దగ్గుతో పాటు రక్తం పడుతుంటే దానిని కూడా టీబీ సమస్యగా భావించవచ్చు.

4 ఎవరికైనా దగ్గుతో పాటు జ్వరం, చలి మొదలైనవి వస్తుంటే దానిని టీబీ లక్షణంగా గుర్తించాలి.

5 ఎవరికైనా దగ్గుతో పాటు ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే అది టీబీకి సంకేతం కావచ్చు.

Updated Date - 2023-02-25T06:55:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising