ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Youtube: 3.4 కోట్ల సబ్‌స్క్రైబర్లు ఉన్న యూట్యూబర్.. ఒక్క తప్పుతో మోనెటైజేషన్ రద్దు.. ఆమె పొరపాటు ఏంటంటే..

ABN, First Publish Date - 2023-10-22T17:32:33+05:30

సాటి యూట్యూబర్ వ్యక్తిగత వివరాలు బయటపెట్టి మోనెటైజేషన్ పొగొట్టుకున్న యువతి.

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం యూట్యూబ్ చుట్టూ ఓ ప్రపంచం అల్లుకుని ఉంది. అందులో వివిధ రకాల ఛానల్స్, యూట్యూబర్లు, వారి మధ్య వివాదాలు, ప్రతీకారంగా అవతలి వారిని విమర్శిస్తూ వీడియోలు చేయడాలు.. ఇవన్నీ వ్యూవర్స్‌కు బోలెడంత వినోదం ఇస్తున్నాయి. అయితే, ఉద్రేకంలో ఏ వీడియో పడితే అది చేస్తే ఏం జరుగుతుందో ఓ యూట్యూబర్‌కు తాజాగా తెలిసొచ్చింది. ఒకే ఒక్క పొరపాటుతో ఆమె తన ఛానల్ మోనెటైజేషన్ కోల్పోయింది.

Viral: రెండేళ్ల క్రితం ఉద్యోగం పోవడంతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన పైలట్..ఇప్పుడు ఎలా ఉన్నాడంటే..

యూట్యూబ్‌లో రియాక్షణ వీడియోలకు(Reaction Videos) ఎంత ఆదరణ ఉందో అందరికీ తెలిసిందే. దీంతో, అనేక మంది కంటెంట్ క్రియేటర్లు ఈ తరహా కంటెంట్‌నే వీక్షకుల ముందు పెడుతుంటారు. అలాంటి వారిలో ఆలియా షీలేష్ , స్నైపర్ వుల్ఫ్ పేరిట ఓ ఛానల్ నిర్వహిస్తుంటుంది(SSSniperwolf). ఆమె ఛానల్‌కు ఏకంగా 3.4 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఆమె కోట్లల్లో ఆదాయం సాధిస్తుంటుంది. అయితే, గతేడాది ఆమెకు మరో యూట్యూబర్ జాక్ డగ్లస్‌తో వివాదం మొదలైంది. అతడికి జాక్‌ఫిల్మ్స్ (Jacksfilms) పేరిట ఓ ఛానల్ ఉంది.

H-1b visa: హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌లో భారీ మార్పులు ప్రతిపాదించిన అమెరికా!

Viral video: నల్లా నుంచి నీరు లోప్రెజర్‌తో వస్తోందని ఇతడేం చేశాడో తెలిస్తే..


ఈ క్రమంలో ఇద్దరూ పోటీపడి తమ ఛానళ్లలో అవతలివారిపై విమర్శలు గుప్పించారు. ఒకరినొకరు నిందించుకుంటూ పలు విమర్శనాత్మక వీడియోలు చేసుకున్నారు. ఓ మహిళగా తనకు వస్తున్న వ్యూస్ చూసి జాక్ తట్టుకోలేకపోతున్నాడని ఆలియా ఆరోపించింది. ఈ క్రమంలో ఒకడుగు ముందుకేసి అతడి ఇంటి వద్దే ఓ వీడియో చేసి నెట్టింట్లో పంచుకుంది. ఇదే ఆమె కొంపముంచింది. తన వ్యక్తిగీత వివరాలు ప్రపంచానికి తెలిసేలా వీడియో చేసిందంటూ (Doxxing) జాక్ ఆలియాపై మండిపడ్డాడు. ఎక్స్ వేదిగా యూట్యూబ్‌కు ఫిర్యాదు చేశాడు. మరోవైపు, అనేక మంది జాక్‌కు మద్దతుగా నిలవడంతో వివాదం పెద్దదైంది.

Mumbai: 17 ఏళ్ల పాటు నమ్మకంగా పనిచేసిన డ్రైవర్ ఒడిగట్టిన దారుణమిది! ఓనర్ ఆ సీక్రెట్ చెప్పగానే..

చివరకు ఈ ఉదంతంపై స్పందించిన యూట్యూబ్ ఆలియా ఛానల్‌కు మోనెటైజేషన్‌ను(Monetization) తాత్కాలికంగా తొలగిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో, దిమ్మెరపోయిన ఆలియా తన తప్పు తెలుసుకుని జాక్‌కు బహిరంగంగా క్షమాపణలు చెప్పింది. అయితే, మోనెటైజేషన్ మళ్లి ఎప్పుడు పునరుద్ధరిస్తారో తెలీక ఆమె అనిశ్చితిలో కూరుకుపోయింది.

Canada Visa: ముదిరిన దౌత్య వివాదం.. భారతీయ విద్యార్థులకు భారీ షాకిచ్చిన కెనడా!

Updated Date - 2023-10-22T17:36:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising