ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sreeleela: పవన్ కళ్యాణ్ పక్కన ఛాన్స్ కొట్టేసింది

ABN, First Publish Date - 2023-02-27T16:38:15+05:30

శ్రీలీల ఇంకొక పెద్ద ఛాన్స్ కొట్టేసింది. పవన్ కళ్యాణ్ (#PawanKalyan), సాయి ధరమ్ తేజ్ (#SaiDharamTej) కథానాయికలుగా నటిస్తున్న సినిమా, తమిళ సినిమా 'వినోదయ సితం' (#VinodhayaSitam) కి రీమేక్ గా వస్తున్న సంగతి తెలిసిందే. (#PKSDT) అందులో ఒక స్పెషల్ సాంగ్ కోసం శ్రీలీల ని తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు శ్రీలీల(#Sreeleela). ఈమె ఈమధ్యనే 'ధమాకా' (#Dhamaka) అనే సినిమాలో రవితేజ (#RaviTeja) పక్కన నటించి, ఆ సినిమా పెద్దగా విజయం సాధించటంలో ఆమె పాత్ర చాలా ఎక్కువ ఉందని అందరికీ తెలిసిన విషయమే. సినిమాలో పాటల విషయం లో శ్రీలీల (#Sreeleela) చేసిన డాన్స్ లు అదుర్స్ లా ఉండటమే కాకుండా, అవే ఆమెకి మంచి పేరుని తీసుకువచ్చాయి అని చెప్పవచ్చు. ఆ సినిమా తరువాత, శ్రీలీల పేరు మారుమోగిపోయింది. వెంటనే త్రివిక్రమ్(#TrivikramSrinivas), మహేష్ బాబు (#MaheshBabu) కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో ఆమె ఛాన్స్ కొట్టేసింది. పూజహెగ్డే (#PoojaHegde) తో పాటు శ్రీలీల కూడా ఒక కథానాయికగా ఆ చిత్ర నిర్వాహకులు ప్రకటించారు.

ఇదిలా ఉండగా, శ్రీలీల ఇంకొక పెద్ద ఛాన్స్ కొట్టేసింది. పవన్ కళ్యాణ్ (#PawanKalyan), సాయి ధరమ్ తేజ్ (#SaiDharamTej) కథానాయికలుగా నటిస్తున్న సినిమా, తమిళ సినిమా 'వినోదయ సితం' (#VinodhayaSitam) కి రీమేక్ గా వస్తున్న సంగతి తెలిసిందే. (#PKSDT) అయితే తమిళ సినిమాలో పాటలు లేవు, కానీ తెలుగు రీమేక్ సినిమాలో ఒక రెండు పాటలు పెట్టాలని చిత్ర నిర్వాహకులు భావించారు. దీనికి సముద్రఖని (#Samuthirakani) దర్శకుడు. అందులో ఒక స్పెషల్ సాంగ్ కోసం శ్రీలీల ని తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ తో పాటుగా ఈ పాట ఉంటుందని, ఈ శ్రీలీల పాట సినిమాకి ఒక హైలైట్ లా ఉండబోతోందని టాలీవుడ్ లో వార్త వైరల్ అవుతోంది.

దానికితోడు శ్రీలీల ఇప్పటికే ఒక మంచి డాన్స్ చెయ్యగల నటిగా గుర్తింపు పొందింది కాబట్టి, ఈ పాట కూడా చాలా మాస్ గా వుండబోతోంది అని అంటున్నారు. ఇలా ఒక తక్కువ కాలం లోనే శ్రీలీల పవన్ కళ్యాణ్ పక్కన అవకాశం కొట్టేసింది. అదీ కాకుండా, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు పెద్ద స్టార్స్ పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది అంటే, ఆమె డిమాండ్ ఎంత వుందో మరి అర్థం చేసుకోండి.

Updated Date - 2023-02-27T16:38:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising