ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళ కడుపులో నాలుగు అడుగుల పాము.. వైరల్ వీడియో...

ABN, First Publish Date - 2023-03-05T20:02:51+05:30

కొన్ని వీడియోలు నెట్టింట్లో పదే పదే తెరపైకి వస్తూ నెటిజన్లను భయపెడుతుంటాయి. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఇంటర్నెట్ డెస్క్: కొన్ని వీడియోలు నెట్టింట్లో పదే పదే తెరపైకి వస్తూ నెటిజన్లను భయపెడుతుంటాయి. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది. సుమారు మూడేళ్ల నాటి వీడియో ఇది. ఇందులో.. ఓ మహిళ నోట్లోంచి వైద్యులు నాలుగు అడుగుల పొడవుతో పాము ఆకారంలో ఉన్న జీవిని వెలికి తీశారు. దాన్ని బయటకు తీసిన నర్సు కూడా భయపడిపోయింది. రష్యాలో తొలిసారిగా ఈ ఘటన బయటపడ్డట్టు చెబుతున్నారు. మహిళకు మత్తుమందు ఇచ్చిన వైద్యులు ఆమె కడుపులోంచి పామును వెలికితీశారు(Snake removed from womans stomach).

కాగా.. వీడియోలోని మహిళది రష్యాలోని(Russia) డగెస్తాన్ ప్రాంతమని తెలిసింది. కొండలు, గుట్టలు అధికంగా ఉన్న ఆ ప్రాంతంలో పాముల సంచారం ఎక్కువ. రాత్రిళ్లు ఆరుబయట నిద్రించేందుకు స్థానికులు జంకుతారు. అయితే.. మహిళ కడుపులోకి అది ఎలా ప్రవేశించిందో ఇప్పటికీ మిస్టరీనే. కొందరేమో ఆమె నోటిలోంచి పాము కడుపులోకి దూరి ఉంటుందని చెప్పారు. మరి కొందరు మాత్రం ఇది అసాధ్యమని కొట్టిపారేశారు. ఆమె కడుపులో ఏదైనా పరాన్నజీవి ఇలా భారీగా పెరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు.

మరోమారు నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో నెటిజన్లను షాక్‌కు గురి చేస్తోంది. వీడియోను చూసిన వారందరూ భయకంపితులయ్యారు. ఇలాంటివి తాము ఎన్నడూ చూడలేదంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. మరీ ఈ వైరల్ వీడియోపై(Viral Video) మీరు ఓ లుక్కేయండి.

Updated Date - 2023-03-05T20:09:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising