ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: అడగ్గానే ముద్దు పెట్టే ఆవు గురించి ఎప్పుడైనా విన్నారా? దీనిపేర ఓ గిన్నిస్ రికార్డు కూడా..జస్ట్ ఒక్క నిమిషంలో..

ABN, First Publish Date - 2023-06-25T18:31:14+05:30

ఓ అమెరికా ఆవు కేవలం ఒక్క నిమిషంలో పది ట్రిక్స్ చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఏకంగా గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: కాస్తంత ట్రైనింగ్ ఇస్తే చాలా జంతువులు మనం చెప్పినట్టు చేస్తాయి. మనం ఆశ్చర్యపోయేలా ట్రిక్స్ చేయగలుగుతాయి. కుక్కలు, పిల్లులు ట్రిక్స్ చేస్తున్న వీడియోలు నిత్యం నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి. ఒకప్పుడు జూపార్కుల్లో సింహాలు, పులులు, ఏనుగులు చేసే ట్రిక్స్ ఎంతగా ఆకట్టుకునేవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఓ ఆవు ఇలాంటి ట్రిక్స్ చేస్తుందని ఎవరూ ఊహించరు. అసలు ఇలాంటి వార్తలు పెద్దగా వెలుగులోకి వచ్చిందీ లేదు. కానీ, అమెరికాలో ఇటీవల ఓ ఆవు కేవలం ఒక్క నిమిషంలో పది ట్రిక్స్ చేసి చూపింది. ఈ క్రమంలో ఓ గిన్నిస్ రికార్డు కూడా నెలకొల్పింది.

నెబ్రాస్కా రాష్ట్రానికి చెందిన మేగన్ రీమాన్ వద్ద ఉన్న ఘోస్ట్ అనే ఆవు(Cow) ఈ గిన్నిస్ రికార్డును(Guiness record) సొంతం చేసుకుంది. కేవలం ఒక నిమిషంలో పది ట్రిక్స్ చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పింది(10 Tricks in one minute). ఇంతకీ ఆ ట్రిక్స్ ఏంటంటే..చెప్పిన చోట నిలబడటం, పిలవగానే రావడం, మెడకు తాడు కట్టేందుకు సహకరించడం, తన చుట్టూ తానే తిరగడం, గంటను తాకడం, అడగ్గానే ముద్దివ్వడం, పిడికిలిని కాలితో తాకడం(ఫిస్ట్ బంప్), ఎత్తుగా ఉన్న పెడెస్టల్‌పై నిలబడటం, ఔనంటూ తలూపడం, గౌరవంగా తలవంచడం. ఈ ట్రిక్స్ అన్నీ కేవలం ఒక నిమిషంలోనే ఆ ఆవు చేసి చూపడంతో గిన్నిస్ రికార్డు దక్కింది. సైగ చేయగానే ఆవు ట్రిక్ చేసి చూపించింది.

తన ఆవు కొత్త ట్రిక్స్ నేర్చుకోవడంలో మంచి ప్రతిభ కనబరుస్తోందని మేఘన్ పేర్కొన్నారు. వివిధ రంగుల మధ్య తేడాలను కూడా గుర్తించగలదని చెప్పారు. తాను ఓ రంగు పేరు చెప్పగానే ఆవు దాన్ని గుర్తించగలుగుతోందని మురిసిపోయారు. ‘‘ఘోస్ట్‌ను మొదట చూడగానే ఇది చాలా ప్రత్యేకమని అనిపించింది’’ అని ఆమె వ్యాఖ్యానించారు. మేఘన్ గుర్రాలకు ఇలాంటి ట్రిక్స్ నేర్పిస్తుంటారు. తాజాగా ఆవుకు కూడా వీటిని నేర్పించడంలో సఫలీకృతమయ్యారు. ఈ ఆవుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా(Viral Video) మారింది.

Updated Date - 2023-06-25T18:31:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising