ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pathaan: బాలీవుడ్ హిస్టరీలోనే సంచలనం.. తొలి రోజే రూ.100కోట్లు..

ABN, First Publish Date - 2023-01-26T18:26:45+05:30

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) హీరోగా నటించిన చిత్రం ‘పఠాన్’ (Pathaan). దీపికా పదుకొణె, జాన్ అబ్రహాం కీలక పాత్రలు పోషించారు. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించాడు. యశ్ రాజ్ ఫిలిమ్స్ భారీ బడ్జెట్‌తో రూపొందించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) హీరోగా నటించిన చిత్రం ‘పఠాన్’ (Pathaan). దీపికా పదుకొణె, జాన్ అబ్రహాం కీలక పాత్రలు పోషించారు. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించాడు. యశ్ రాజ్ ఫిలిమ్స్ భారీ బడ్జెట్‌తో రూపొందించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జనవరి 25న విడుదలైంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలీవుడ్‌‌ చరిత్రలోనే ఈ చిత్రం సంచలనం సృష్టించింది. వరల్డ్ వైడ్‌ బాక్సాఫీస్ వద్ద రూ.100కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

బాలీవుడ్ హిస్టరీలోనే తొలిరోజు వసూళ్లలో ‘పఠాన్’ రికార్డు సృష్టించింది. ఈ సినిమా తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.106కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇండియాలో హిందీ వెర్షన్ రిలీజ్ డే నాడు రూ.55కోట్ల నెట్ కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. డబ్బింగ్ వెర్షన్స్ నుంచి మరో రెండు కోట్లు వచ్చాయి. అంటే ‘పఠాన్’ తొలిరోజు నెట్ వసూళ్లు ఇండియాలో రూ.57కోట్లు.. గ్రాస్ కలెక్షన్స్ రూ.67కోట్లు అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ చిత్రం ఓవర్సీస్ మార్కెట్స్ నుంచి రూ.39కోట్లను రాబట్టింది. ఈ మూవీ కలెక్షన్స్ రెండో రోజు మరింత అధికమయ్యే అవకాశం ఉంది. ఇండియాలో ఈ సినిమా రెండో రోజు రూ.60కోట్ల నెట్ వసూళ్లను రాబడుతుందని అంచనా. ఇక ‘పఠాన్’ విషయానికి వస్తే.. ఈ సినిమాను దాదాపుగా రూ.250కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించారు. షారూఖ్ ఖాన్ ఐదేళ్ల తర్వాత స్క్రీన్ పైకి రీ ఎంట్రీ సినిమాపై భారీ అంచనాలేర్పడ్డాయి. ఆ అంచనాలను మించి రాణించడంతో చిత్రం భారీ కలెక్షన్స్ ను కొల్లగొడుతుంది.

Updated Date - 2023-01-26T18:26:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising