ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Akkineni Akhil: ‘ఏజెంట్’ ట్రైలర్‌పై స్పందించిన సమంత

ABN, First Publish Date - 2023-02-04T20:26:57+05:30

అక్కినేని అఖిల్‌ (Akkineni Akhil) హీరోగా నటించిన సినిమా ‘ఏజెంట్‌’ (Agent). ఈ స్టైలిష్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌‌‌కు స్టార్ డైరెక్టర్ సురేంద‌ర్‌ రెడ్డి (Surender Reddy) దర్శకత్వం వహించారు. ఈ చిత్రం పలు కారణాల వల్ల అనేక సార్లు వాయిదా పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అక్కినేని అఖిల్‌ (Akkineni Akhil) హీరోగా నటించిన సినిమా ‘ఏజెంట్‌’ (Agent). ఈ స్టైలిష్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌‌‌కు స్టార్ డైరెక్టర్ సురేంద‌ర్‌ రెడ్డి (Surender Reddy) దర్శకత్వం వహించారు. ఈ చిత్రం పలు కారణాల వల్ల అనేక సార్లు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా ‘ఏజెంట్‌’ (Agent) విడుదల తేదీని ఓ ప్రోమో ద్వారా వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 28న విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ ట్రైలర్‌ను అఖిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయంగా టాప్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు (Samantha Ruth Prabhu) స్పందించారు.

‘ఏజెంట్’ ట్రైలర్‌లో అఖిల్ పూర్తిగా మాస్ లుక్‌లో కనిపించారు. ఈ ట్రైలర్‌ను చూసిన సామ్ ‘బీస్ట్ మోడ్ ఇస్ ఆన్’ అని రిప్లై ఇచ్చారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే సమంత పుట్టిన రోజు నాడే ‘ఏజెంట్’ విడుదల అవుతుంది. కొన్నాళ్ల క్రితం సమంత అనారోగ్యంతో బాధపడుతుందని తెలిసినప్పుడు అఖిల్ కూడా ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్నప్పటికి ఆయన సోదరుడు అఖిల్‌‌తో సామ్ మంచి సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తున్నారని ఈ పోస్ట్‌లను బట్టి అర్థమవుతుంది. ‘ఏజెంట్’ పాన్ ఇండియాగా తెరకెక్కింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో సాక్షి వైద్య (Sakshi Vaidya) హీరోయిన్‌గా నటించారు. మమ్ముట్టి (Mammootty) ఓ కీలక పాత్రను పోషించారు.

Updated Date - 2023-02-04T20:26:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising