ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోబో రిక్షావాలా

ABN, First Publish Date - 2023-04-23T12:11:42+05:30

ఇప్పటిదాకా రెస్టారెంట్లలో ఫుడ్‌ సర్వ్‌ చేసే రోబోలను... పంటపొలాల్లో కలుపుమొక్కలను తీసే రోబోలను చూశాం....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇప్పటిదాకా రెస్టారెంట్లలో ఫుడ్‌ సర్వ్‌ చేసే రోబోలను... పంటపొలాల్లో కలుపుమొక్కలను తీసే రోబోలను చూశాం.. కానీ రిక్షావాలాగా మారిన రోబోను ఎప్పుడైనా చూశారా? అప్పుడెప్పుడో కలకత్తాలో రిక్షా లాక్కుంటూ వెళ్లే రిక్షావాలాలను చూశాం. ఇప్పుడు అచ్చంగా మనిషి మాదిరిగా నడుస్తూ రిక్షాను లాగుతున్న రోబోను రోడ్డుపై చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.

గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన నలుగురు విద్యార్థులు సుమారు 25 రోజులు శ్రమించి ఈ వినూత్న రోబోను తయారుచేశారు. దీని తయారీకి 30 వేల రూపాయలు ఖర్చు అయ్యిందట. మనిషి ఎలా నడుస్తాడు? అన్న దానిపై అధ్యయనం చేసి ఈ రోబోను సృష్టించారు. ఇది ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ రోబో. పూర్తిగా ఆటోమేటిక్‌. మనం ఏం చెబితే దాన్ని బట్టి రెస్పాండ్‌ అవుతుంది. మొబైల్‌ సాయంతో దీన్ని కంట్రోల్‌ చేయొచ్చు. పలానా చోటుకు వెళ్లి వస్తువులు డెలివరీ చేసి రావాలని ఫోన్‌లో మెసేజ్‌ పెడితే చాలు... ఆటోమేటిక్‌గా ఆ చోటుకు వెళ్లి డెలివరీ చేస్తుంది. దాని లోపల మొత్తం మ్యాపింగ్‌ ఉంటుంది. పూర్తిగా బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. టెస్టింగ్‌ ట్రయల్స్‌ కోసం రోడ్డుపైకి తీసుకువచ్చిన ఈ రోబో వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యింది. ఈ రిక్షావాలా రోబో నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. దాన్ని తయారుచేసిన విద్యార్థులపై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది.

Updated Date - 2023-04-23T12:11:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising