ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇలాంటి వాళ్లు అరుదుగా మాత్రమే పుడతారట! నెట్టింట ఫొటోలు విపరీతంగా వైరల్!

ABN, First Publish Date - 2023-05-09T18:37:09+05:30

మిర్రర్ హ్యాండ్ సిండ్రోమ్ అనే వ్యాధి బారిన పడ్డ వారిలో చేయి వాటి ప్రతిబింబం ఒకేలా ఉంటాయట. ఈ వ్యాధికి సంబంధించి ఇప్పటివరకూ కేవలం 70 కేసులు మాత్రమే వైద్యుల దృష్టికి వచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: మనుషుల చేతులు బింబప్రతిబింబాల్లా ఉంటాయి. అంటే..అద్దంలో కనిపించే ఒక చేయి ప్రతిబింబమే మరో చేయి అన్నమాట. ఇంగ్లిష్‌లో వీటిని మిర్రర్ ఇమేజస్ అంటారు. రెండు చేతులూ చూడటానికి దాదాపుగా ఒకేలా ఉన్న కాస్త తరచి చూస్తే దేనికదే భిన్నంగా ఉన్న విషయం స్పష్టమవుతుంది. అయితే, మిర్రర్ హ్యాండ్ సిండ్రోమ్(Mirror hand syndrome) బారిన పడ్డ వారిలో ఒక చేయి, దాని ప్రతిబింబం దాదాపు ఒకేలా ఉంటాయట.

పుట్టుకతో వచ్చే అల్నార్ డైమేలియా అనే సమస్య కారణంగా ఇలాంటి చేయితో పుడతారని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధి ఉన్న చేతికి ఏడు లేదా ఎనిమిది వేళ్లు ఉంటాయి. మధ్య వేలికి చెరో వైపు ఒకేలా కనిపించే మూడు వేళ్లు ఏర్పడతాయి. ఇలాంటి వాళ్లల్లో బొటన వేలు ఉండదు. ఈ సమస్యకు సర్జరీ కూడా ఓ పరిష్కారమని వైద్యులు చెబుతారు. అంటే, శస్త్రచికిత్స చేసి అదనంగా ఉన్న వేళ్లను తొలగిస్తారన్నామాట. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 70 కేసులు మాత్రం వైద్యుల దృష్టికి వచ్చాయట. ఈ వ్యాధి బారిన పడ్డ వారిలో కొన్ని సార్లు శస్త్రచికిత్స ద్వారా లోపాన్ని సరిదిద్దవచ్చని వైద్యులు చెబుతున్నారు.

ఇదే సమస్యతో జన్మించిన ఓ బాలికకు సంబంధించి పూర్తి వివరాలతో 2018లో ఓ అధ్యయనం ప్రచురితమైంది. అప్పట్లో వైద్యులు ఆ బాలికకు అదనంగా ఉన్న వేళ్లను వైద్యులు శస్త్రచికిత్స చేసి తొలగించారు. ఇక ఈ వ్యాధి ఎందుకు వస్తుందో ఇప్పటికీ స్పష్టతలేదు. కానీ, బిడ్డ కడుపులో ఉండగానే ఈ సమస్య ఉన్నదీ లేనిదీ పరీక్షించి తెలుసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.

Updated Date - 2023-05-09T18:37:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising