Viral: వైద్య చరిత్రలోనే అదురైన ఘటన.. 58 ఏళ్ల వయసులో కవల పిల్లలకు జన్మనిచ్చిన మహిళ..!
ABN, First Publish Date - 2023-06-26T19:25:25+05:30
58 ఏళ్ల వయసులో పండంటి కవలలను కన్న రాజస్థాన్ మహిళ. ఐవీఎఫ్ పద్ధతిలో ఆమె సంతానభాగ్యం పొందారు. ఎన్నో ఏళ్ల కల నెరవేరినందుకు ఆమె ఆనందానికి అంతేలేకుండా పోయింది.
ఎన్నారై డెస్క్: ‘‘అమ్మా అని పిలిపించుకోవాలని ఉంది..’’ ఓ 58 ఏళ్ల మహిళ ఈ మాటలు అంటుంటే విని వైద్యురాలే అవాక్కయ్యింది. కానీ సాటి మహిళ బాధ అర్థం చేసుకున్న ఆ వైద్యురాలు మహిళకు సంతానభాగ్యం కలిగించింది. రెండేళ్ల పాటు ట్రీట్‌మెంట్ తీసుకున్న ఆ మహిళ ఇటీవలే కవలలకు జన్మనిచ్చింది. ఒకే కాన్పులో ఆడ, మగపిల్ల జన్మించడంతో ఆమె ఆనందానికి అంతేలేకుండా పోయింది. రాజస్థాన్‌లోని(Rajasthan) బికనీర్ జిల్లాలో ఇటీవల వెలుగు చూసిందీ ఘటన
పూర్తి వివరాల్లోకి వెళితే.. షేరా భాడూకు 58 ఏళ్ల మహిళ. దురదృష్టవశాత్తూ ఆమెకు ఎంతకాలానికి సంతానభాగ్యం కలగలేదు. దీంతో ఆమె డా. షెఫాలీ దధిచ్‌ను ఆశ్రయించారు. తన గోడు వెళ్లబోసుకున్నారు. సాటి మహిళగా ఆమె బాధను అర్థం చేసుకున్న డా.షెఫాలీ షేరాకు సాయం చేసేందుకు నిర్ణయించుకున్నారు. రెండేళ్ల క్రితం ఆమెకు సంతానసాఫల్య చికిత్స ప్రారంభించారు. షేరా శరీరంలోని హార్మోన్ల సమతౌల్య స్థితికి వచ్చేలా ట్రీట్‌మెంట్ ఇచ్చారు. ఆ తరువాత ఐవీఎఫ్ చికిత్స ద్వారా షేరా గర్భం దాల్చారు(Pregnancy at the age of 58). ఇటీవలే ఆమె పండంటి కవలలకు జన్మనిచ్చారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉండటంతో అంతా సంతోషించారు. వృధ్యాప్యం అంచుకు చేరుకున్న ఓ మహిళ ఇలా ఏకంగా కవలలకు జన్మనివ్వడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
ముఫ్ఫై ఏళ్లలోపు సమయం మహిళలకు సంతానం పొందేందుకు అత్యంత అనుకూలమైన టైం అని డా.షెఫాలీ వ్యాఖ్యానించారు. అయితే, అనేక కారణాల రీత్యా అనేక మంది మహిళలకు పిల్లలు కలగడం ఆలస్యమవుతుందని చెప్పారు. ఆధునిక వైద్య విధానాల ద్వారా 50 ఏళ్లు దాటిన తరువాత కోసం మహిళలు సంతానం కోసం ప్రయత్నించవచ్చని చెప్పుకొచ్చారు.
Updated Date - 2023-06-26T19:25:28+05:30 IST