Viral: ఈ పోటీలో ఓడిపోవడమే మంచిది లెండి.. నెట్టింట మోదీ ట్వీట్ వైరల్! అసలేం జరిగిందంటే..
ABN, First Publish Date - 2023-06-11T18:54:11+05:30
భారతీయ వంటకాలను ఆస్వాదిస్తూ నెట్టింట ఓ వీడియోను షేర్ చేసిన జపాన్ రాయబారి. ఈ వీడియో తనకు నచ్చడంతో వెంటనే రెస్పాండైన ప్రధాని మోదీ. బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారుగా అంటూ కామెంట్!
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లోని జపాన్ రాయబారి హిరోషి సుజుకీ(Japanese Ambassador) ప్రస్తుతం రకరకాల దేశీయ వంటకాలను ఆస్వాదిస్తున్నారు. తన భార్యతో కలిసి వివిధ నగరాల్లోని వంటకాల రుచి చూస్తూ(Indian street food) ఆ వీడియోలను నెట్టింట పోస్ట్ చేస్తు్న్నారు. ఇవి ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఆయన బెనారసీ చాట్‌ను లొట్టలేసుకుంటూ తిన్నారు. ఆ తరువాత వారణాసిలో థాలీని కూడా రుచి చూశారు. ఇక ముంబైలో వడా పావ్‌నూ ఆస్వాదించారు.
తాజాగా ఆయన తన భార్యతో కోల్హాపురీ వంటకాలను తిన్నారు. కొల్హాపురి వంటకాలన్నీ కాస్త ఘాటుగానే ఉంటాయి. దీంతో, రాయబారి ఈ ఘాటును తట్టుకోలేకపోయారు. కాస్తంత కారం తక్కువగా ఉంటే మరింత బాగుండేదని కామెంట్ చేశారు. అయితే, ఈ మాత్రం కారం ఉండాల్సిందేనని ఆయన భార్య చెబుతూ ఆ ఫుడ్‌ను ఎంజాయ్ చేశారు.
ఇదంతా వీడియో తీసిన రాయబారి సుజుకీ నెట్టింట పోస్ట్ చేసేశారు. ‘‘ఈ విషయంలో నా భార్య నన్ను ఓడించిందిగా’’ అంటూ ఓ క్యాప్షన్ కూడా జతచేశారు. ఇది వైరల్‌గా మారి ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ(PM modi) దృష్టినీ ఆకర్షించింది. దీంతో, మోదీ కూడా తనదైన శైలిలో స్పందించారు. ‘‘ఈ పోటీలో ఓడిపోవడం మంచిదే రాయబారి గారూ! మీరు భారతీయ వంటకాలు బానే ఎంజాయ్ చేస్తున్నట్టు ఉన్నారుగా! అలాక్కానీయండి.. మరిన్ని వీడియోలను పోస్ట్ చేయండి’’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ఉదంతం నెట్టింట వైరల్‌గా(Viral) మారింది.
Updated Date - 2023-06-11T18:54:13+05:30 IST