ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

chanakya niti: ఇలాంటి వారు త్వరగా ముసలితనం బారినపడతారు!

ABN, First Publish Date - 2023-01-18T07:30:09+05:30

ఆచార్య చాణక్యుడు తన విధానాలలో మానవులు చేసే కర్మల నుండి వారి భవిష్యత్తు వరకు అనేక విషయాలను చెప్పాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆచార్య చాణక్యుడు తన విధానాలలో మానవులు చేసే కర్మల నుండి వారి భవిష్యత్తు వరకు అనేక విషయాలను చెప్పాడు. చాణక్య నీతిలో వయసు ఉండగానే ఎలాంటివారు వృద్ధులవుతారో, వారి చర్యలు ఎలా ఉంటాయో కూడా తెలియజేశారు. దీనితో పాటు ఇలా జరగకుండా ఉండాలంటే ఏమి చేయాలో కూడా చెప్పారు. వీటిని అమలు చేయడం ద్వారా మనిషి త్వరగా వచ్చే వృద్ధాప్యం ముప్పు నుంచి బయటపడవచ్చు.

అధికంగా ప్రయాణం చేసేవారు

ఆచార్య చాణక్య ప్రకారం ఎక్కువ ప్రయాణాలు చేసే వ్యక్తులు త్వరగా వృద్ధాప్యం బారిన పడతారు. ఎందుకంటే అలాంటి వారి దినచర్య సక్రమంగా ఉండదు. అలాంటి వారు తమ ఆహారం విషయంలో కూడా శ్రద్ధ వహించలేరు. ఎవరి జీవితంలో అధికంగా ఉరుకులు పరుగులు ఉంటాయో వారు వెంటనే అప్రమత్తంగా కావాలి. లేకపోతే అలాంటి వారు వయసున్నప్పుడే వృద్ధులవుతారు.

శారీరక సుఖం పొందని స్త్రీ

కాలానుగుణంగా శారీరక సుఖం పొందని స్త్రీలు త్వరగా వృద్ధులైపోతారని చాణక్య నీతిలో చాణక్య తెలియజేశారు. కాలానుగుణంగా శారీరక ఆనందం పొందని స్త్రీలు జాగ్రత్తగా ఉండాలని ఆచార్య చాణక్యుడు చెప్పాడు.

కష్టపడి పనిచేయనివారు

చాణక్య నీతిలో తెలిపిన వివరాల ప్రకారం అస్సలు కష్టపడని వారు త్వరగా వృద్ధులవుతారు. గుర్రం చేసే ప్రధాన పని పరిగెత్తడం. మనిషి అదే మాదిరిగా కష్టపడి పనిచేయకుండా, ఒకే చోట కూలబడితే అతను త్వరగా ముసలితనం బారిన పడతాడు.

Updated Date - 2023-01-18T07:30:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising