ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అరుదైన కేసు.. జరిమానా చెల్లించాల్సిన వ్యక్తే చనిపోతే ఆ డబ్బు ఎవరివ్వాలి..? కోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే..

ABN, First Publish Date - 2023-02-03T15:38:46+05:30

ఏదైనా ఓ సంస్థకు జరిమానా చెల్లించాల్సిన వ్యక్తి చనిపోతే ఏం చెయ్యాలి? ఆ డబ్బును ఎలా రికవరీ చేసుకోవాలి. ఓ కేసు విచారణలో భాగంగా కర్ణాటక హైకోర్టు (Karnataka High Court) కీలక నిర్ణయం వెలువరించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏదైనా ఓ సంస్థకు జరిమానా చెల్లించాల్సిన వ్యక్తి చనిపోతే ఏం చెయ్యాలి? ఆ డబ్బును ఎలా రికవరీ చేసుకోవాలి. ఓ కేసు విచారణలో భాగంగా కర్ణాటక హైకోర్టు (Karnataka High Court) కీలక నిర్ణయం వెలువరించింది. జరిమానా చెల్లించాల్సిన వ్యక్తి చనిపోతే.. అతని ఆస్తులకు ఎవరు వారసులైతే వారిని నుంచి ఆ డబ్బులను వసూలు చేయాలని తీర్పునిచ్చింది. ఓ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ శివశంకర్ అమర్నవర్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

కర్ణాటకలోని హసన్ జిల్లాకు చెందిన తోటిల్ గౌడ్‌ అనే వ్యక్తికి రాష్ట్ర ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ విద్యుత్ చట్టానికి (Electricity Act) వ్యతిరేకంగా చౌర్యం చేసినందుకు 2011లో రూ.29,204 జరిమానా విధించింది. దానిని ప్రశ్నిస్తూ తోటిల్ గౌడ కోర్టుకు వెళ్లాడు. అక్కడ తీర్పు వ్యతిరేకంగా రావడంతో హైకోర్టులో అప్పీలు చేశాడు. అయితే హైకోర్టులో పిటిషన్ విచారణలో ఉండగానే తోటిల్ గౌడ మృతి చెందాడు. పిటిషనర్ మరణించిన నేపథ్యంలో హైకోర్టు అప్పీల్ పిటిషన్‌ను కొట్టివేసింది. జరిమానా మొత్తాన్ని దోషి ఆస్తి నుంచి లేదా ఆస్తి వారసుల నుంచి రికవరీ చేయాలని (Fine can be recovered Heirs) ఆదేశించింది.

Updated Date - 2023-02-03T15:38:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising