10 రోజుల క్రితమే పెళ్లి.. టాయ్‌లెట్‌కు వెళ్లిన భార్య ఇంకా రాలేదేంటని డౌట్.. ఎక్కడా కనిపించకపోవడంతో సీసీ కెమెరాలను చెక్ చేస్తే..
ABN, First Publish Date - 2023-02-21T17:54:10+05:30
ఇప్పుడే వస్తానంటూ టాయ్‌లెట్‌కు వెళ్లిన భార్య.. భర్తకు ఊహించని షాక్..
ఇంటర్నెట్ డెస్క్: అప్పటికీ ఆ జంట పెళ్లై పది రోజులే అయ్యింది. కుటుంబమంతా కలిసి దేవాలయానికి వెళ్లారు. దైవదర్శనం తరువాత కొత్త పెళ్లికూతురు బాత్‌రూంకు వెళ్లాలని భర్తకు చెప్పింది. అతడి నుంచి రూ.10 తీసుకుని తన సెల్‌ఫోన్ అతడికి ఇచ్చి ఇప్పుడే వస్తానని చెప్పి ఆమె వెళ్లిపోయింది. అయితే.. నిమిషాలు గంటలుగా మారినా ఆమె తిరిగిరాలేదు. దీంతో.. భర్త మనసు కీడుశంకించింది. ఈ క్రమంలో కుటుంబమంతా దేవాలయం పరిసర ప్రాంతాల్లో యువతి కోసం తెగ వెతికింది. ఆ తరువాత సీసీటీవీ ఫుటేజీలో భార్య చేసిన పని చూసి అతడు నిర్ఘాంతపోయాడు.
ఉత్తరప్రదేశ్‌లో తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే.. జోన్‌పూర్‌కు చెందిన ఓ యువకుడికి ఆజంగఢ్‌కు చెందిన యువతితో ఫిబ్రవరి 10న అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. ఇటీవలే ఆమె అత్తారింటికి వచ్చింది. ఈ క్రమంలో ఓ రోజు కుటుంబమంతా కలిసి మిర్జాపూర్‌లోని వింధ్యాచల్ దేవాలయానికి వెళ్లింది. ఇక దైవదర్శనం తరువాత.. బాత్‌రూంకంటూ వెళ్లిన భార్య ఎంతకీ తిరిగిరాకపోవడంతో భర్త ఒక్కసారిగా ఆందోళన చెందాడు.
కుటుంబసభ్యులతో కలిసి ఆ ప్రాంతమంతా వెతికినా ఆమె జాడ కనిపించకపోవడంతో అక్కడి షాపుల వారిని రిక్వెస్ట్ చేసి సీసీఫుటేజీ చూశాడు. అందులో కనిపించిన దృశ్యాలు చూసి ఒక్కసారిగా దిమ్మెరపోయాడు. ఆమె తన ప్రియుడితో కలిసి వెళ్లిపోయిందని తెలుసుకుని కుటుంబమంతా షాకైపోయింది. బాత్‌రూంకు వెళ్లాలని చెప్పి వచ్చిన యువతి కాలినడక సమీపంలోని ఓ ప్రాంతానికి వెళ్లింది. అప్పటికే యువతి ప్రియుడు ఆమె కోసం బైక్‌పై వేచి చూడసాగాడు. ఈ క్రమంలో ఆమె అతడి వెంట బైక్‌పై వెళ్లిపోయింది. దీంతో.. యువకుడు లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Updated Date - 2023-02-21T17:55:34+05:30 IST