ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Samantha: నువ్వు ఫీల్ అవుతావని పోస్ట్ చేయట్లేదు: నందిని రెడ్డి

ABN, First Publish Date - 2023-01-26T19:35:05+05:30

మయోసైటిస్‌తో బాధపడుతున్న సమంత (Samantha) ప్రాజెక్టులను పట్టాలెక్కించే పనిలో పుల్ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఫిటనెస్‌పై దృష్టారించింది. తాజాగా ఓ ఫిట్‌నెస్ వీడియోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మయోసైటిస్‌తో బాధపడుతున్న సమంత (Samantha) ప్రాజెక్టులను పట్టాలెక్కించే పనిలో పుల్ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఫిటనెస్‌పై దృష్టారించింది. తాజాగా ఓ ఫిట్‌నెస్ వీడియోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ పోస్ట్‌కు ఆలియా భట్, దేవ్ మోహన్, నందిని రెడ్డి, సుశాంత్, రుహానీ శర్మ తదితరులు స్పందించారు. సామ్ రెండు చేతులతో చేస్తున్న వర్కౌట్‌ను తాను ఒక్క చేత్తోనే చేశానని నందిని రెడ్డి (Nandini Reddy) చెప్పింది. కానీ, సమంత ఫీల్ అవుతందనే కారణంతో సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేదని తెలిపింది. ఆమె చేసిన కామెంట్‌ నెటిజన్స్‌తో నవ్వులు పూయించింది.

సమంత ‘సిటాడెల్’ (Citadel) వెబ్ సిరీస్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోలో యాక్షన్ సీక్వెన్స్ భారీగా ఉన్నాయి. పోరాట సన్నివేశాలు చేయాల్సి ఉండటంతో సామ్ పిట్‌నెస్‌పై దృష్టిసారించింది. ఈ క్రమంలోనే వర్కౌట్స్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘‘కష్టమైన సమయంలో నాలో స్ఫూర్తిని నింపినందుకు ‘హుఈజ్‌గ్రావిటీ’ బ్యాండ్‌కు ధన్యవాదాలు. కఠినమైన డైట్‌ను ఫాలో అవుతున్నప్పటికీ.. ఆహారం తినడం వలనే బలం రాదని.. మన ఆలోచన విధానంపై అది ఆధారపడి ఉంటుందని నాకు తెలిసింది’’ అని సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్‌కు సెలబ్రిటీలతో సహా సామాన్యులు స్పందించారు. కానీ, నందిని రెడ్డి చేసిన కామెంట్ మాత్రం నెటిజన్స్ దృష్టిని ఆకర్షించింది. ఇక సమంత కెరీర్ విషయానికి వస్తే.. ఖుషీ సినిమాలో నటిస్తుంది. అనారోగ్యం కారణంగా ఈ మూవీ షూటింగ్‌కు బ్రేక్ పడింది. ఆమె నటించిన ‘శాకుంతలం’ (Shaakuntalam) విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ పలు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 17న రిలీజ్ కానుంది.

Updated Date - 2023-01-26T19:36:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising