ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తల్లి ప్రేమ

ABN, First Publish Date - 2023-03-05T10:41:10+05:30

ఈ సృష్టిలో అన్ని ప్రేమలకు అర్థాలు చెప్పొచ్చు కానీ ‘అమ్మ ప్రేమ’ను మాత్రం ఎవరూ నిర్వచించలేరు. పదాలు దొరక్కపోతేనేం....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఈ సృష్టిలో అన్ని ప్రేమలకు అర్థాలు చెప్పొచ్చు కానీ ‘అమ్మ ప్రేమ’ను మాత్రం ఎవరూ నిర్వచించలేరు. పదాలు దొరక్కపోతేనేం... ఒక చిత్రం ఎన్నో అర్థాలను చెబుతుందనడంలో సందేహం లేదు. ఇక్కడ మీరు చూస్తున్నది ఒక సృజనాత్మక, అరుదైన కళాఖండం. తల్లి తన పిల్లలను ఎలా చూసుకుంటుందో కళ్లకు కట్టినట్టు చూపెట్టే అద్భుతమైన ఊహ ఇది. 2021లో ఫెడెరికా సలా అనే శిల్పకారిణి ‘బ్రూనోస్‌ స్వింగ్‌’ క్యాప్షన్‌తో ఈ శిల్పాన్ని తయారుచేశారు. దాన్ని ఇటీవల ఒకరు ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఇనుపరాడ్లతో చేసిన ఒక తల్లి భుజానికి హృదయాకారంలో ఉన్న ఎర్రటి కుర్చీని వేలాడదీశారు. చూడటానికి అది సరిగ్గా ఆమె హృదయంలాగే కనిపిస్తుంది. అందులో పిల్లాడు కూర్చుని ఊయలలా ఊగుతుంటే అచ్చంగా తల్లి హృదయం ఓలలాడుతున్నట్టే ఫీలవుతాం. వీడియాలో ఆర్టిస్టు తన కుమారుడిని కుర్చీలో కూర్చోబెట్టి మెల్లిగా ఊపుతుంటే... ఆ దృశ్యం చూసి ‘అద్భుతం’ అనకుండా ఉండలేం. ఇప్పటిదాకా కట్టిపడేసే శిల్పాలను చూసి ఉండొచ్చు కానీ, ఈ సృజనను చూస్తే అచ్చంగా తల్లి హృదయ స్పందనను వీక్షిస్తున్న భావన కలుగుతుంది. సోషల్‌ మీడియాలోని కళా ప్రియులను ఈ కళాఖండం అమితంగా ఆకట్టుకుంటోంది.

Updated Date - 2023-03-05T10:41:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising