ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Manchu Manoj marriage: మోహన్ బాబే దగ్గరుండి వివాహం చేయించారు, ఫోటోస్ వైరల్

ABN, First Publish Date - 2023-03-04T11:44:22+05:30

నిన్న శుక్రవారం మంచు కుటుంబం లో సందడి జరిగింది. మోహన్ బాబు రెండో తనయుడు మంచు మనోజ్ తన చిన్ననాటి స్నేహితురాలు అయిన భూమా మౌనిక రెడ్డి ని శాస్త్రోక్తంగా జరిగిన వేడుకలో వివాహం చేసుకున్నాడు. ఈ వేడుక అంతా ఫిలిం నగర్ లోని, మంచు లక్ష్మి ఇంట్లో జరిగింది అని సన్నిహితులు చెపుతున్నారు.

Manchu Manoj weds Bhuma Mounica Reddy on Friday night in Hyderabad.
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

నిన్న శుక్రవారం మంచు కుటుంబం (Manchu Family) లో సందడి జరిగింది. మోహన్ బాబు (Mohan Babu) రెండో తనయుడు మంచు మనోజ్ (Manchu Manoj) తన చిన్ననాటి స్నేహితురాలు అయిన భూమా మౌనిక రెడ్డి (Bhuma Mounica Reddy) ని శాస్త్రోక్తంగా జరిగిన వేడుకలో వివాహం చేసుకున్నాడు. ఈ వేడుక అంతా ఫిలిం నగర్ లోని, మంచు లక్ష్మి (Manchu Lakshmi) ఇంట్లో జరిగింది అని సన్నిహితులు చెపుతున్నారు. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే ఈ పెళ్ళికి హాజరయినట్టుగా కూడా తెలిసింది.

అయితే ఈ పెళ్లి మనోజ్ తండ్రి మోహన్ బాబు కి ఇష్టం లేదని, (Manchu Manoj Marriage) అందుకే అతను ఎక్కడా కనపడటం లేదని సాంఘీక మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. మోహన్ బాబు నిన్న రాత్రి వరకు ఎక్కడా కనపడకుండా, సందడి చెయ్యకుండా ఉండటం తో అతనికి ఇష్టం లేదేమో, అందుకే రావటం లేదని అనుకున్నారు చాలామంది.

కానీ ఈ వార్తలు అన్నీ నిరాధారాలు అని తేలిపోయాయి. నిన్న రాత్రి అధికారికంగా విడుదల చేసిన పెళ్లి ఫోటోస్ లో మోహన్ బాబు దగ్గరుండి పెళ్లి చేస్తున్నట్టు కనిపించారు.

దీనితో ఈ వివాదాలకు అన్నిటికీ తెర దించినట్టు అయింది. మనోజ్ (Manoj wedding) తల్లిదండ్రులు ఇద్దరూ ఈ వివాహం దగ్గరుండి చేర్పించటమే కాకుండా, కోడలు మౌనిక ని మోహన్ బాబు తన కూతురు వలెనే హృదయానికి హత్తుకొని దీవించటం కూడా చూసారు. ఇంకా అంత కంటే ఇంకేమి కావాలి, అతని ఆశీస్సులు ఈ జంటకి ఉన్నాయని చెప్పటానికి.

అలాగే మనోజ్ అన్న మంచు విష్ణు (Manchu Vishnu) కూడా ఈ వివాహానికి హాజరు అయ్యి తన ఆశీస్సులు అంద చేశారు. మనోజ్, మౌనికలు ఇద్దరికీ ఇది రెండో పెళ్లి, మౌనికకు తన మొదటి భర్త వలన ఒక బాబు కూడా వున్నాడు.

ఈ ఇద్దరూ, అలాగే ఈ రెండు కుటుంబాలూ చాలా కాలం నుండి మంచి సంబంధ బాంధవ్యాలు మెయిన్ టైన్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ వివాహం తో ఆ రెండు కుటుంబాల మధ్య సంబంధం మరింత బలపడే దిశగా వెళ్ళింది.

Updated Date - 2023-03-04T11:53:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!