ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chiranjeevi: బాబీ సింహా సినిమా ట్రైలర్ విడుదల చేసిన చిరు

ABN, First Publish Date - 2023-02-06T16:29:18+05:30

విభిన్న పాత్రలు, విలక్షణ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు బాబీ సింహా (Bobby Simha). ‘జిగర్తాండ’, ‘నేరమ్’, ‘మహాన్’ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘వసంత ముల్లై’ (Vasantha Mullai).

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విభిన్న పాత్రలు, విలక్షణ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు బాబీ సింహా (Bobby Simha). ‘జిగర్తాండ’, ‘నేరమ్’, ‘మహాన్’ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘వసంత ముల్లై’ (Vasantha Mullai). తెలుగు, తమిళ్, కన్నడలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులోకి ‘వసంత కోకిల’ (Vasantha Kokila) టైటిల్‌తో డబ్ అవుతుంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. అందులో భాగంగా ట్రైలర్‌ను విడుదల చేశారు.

‘వసంత కోకిల’ మిస్టరీ థ్రిల్లర్‌ జోనర్‌లో రూపొందింది. తెలుగు ట్రైలర్‌ను తాజాగా మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ఈ ట్రైలర్‌లో.. బాబీ సింహా, కశ్మీర పరదేశీల మధ్య లవ్ ట్రాక్ ఆకట్టుకుంది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా మూవీ రూపొందినట్టు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతుంది. ఈ చిత్రంలో ఆర్య, రమా ప్రభలు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి పురుషోత్తమ రమణన్ దర్శకత్వం వహించారు. మధుర ఫిలిమ్ ఫ్యాక్టరీ, ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై రేష్మి సిన్హా, రజనీ తల్లూరి, రామ్ తల్లూరి నిర్మించారు. రాజేష్ మురుగేషన్ సంగీతం అందించారు. నలభై ఏళ్ల క్రితం విడుదలైన ‘వసంత కోకిల’ లో కమల్‌ హాసన్‌, శ్రీదేవి నటించారు. తాజాగా అదే టైటిల్‌తో బాబీ సింహా నుంచి సినిమా వస్తుండంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

Updated Date - 2023-02-06T16:33:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising