Husband: ఏం పనయ్యా ఇది.. ఏడేళ్ల క్రితమే పెళ్లి.. ఇద్దరు పిల్లలు కూడా.. అయినా ఇదేం పని.. భార్యకు చెప్పి మరీ..!
ABN, First Publish Date - 2023-06-16T15:37:26+05:30
భార్యాపిల్లలు ఉన్న ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో పరిచయమైన మరో వివాహితతో పరారయ్యాడు. చేతిలో డబ్బులు అయిపోయే సరికి మళ్లీ మొదటి భార్యనే ఆశ్రయించాడు. భర్త చేసిన మోసం తట్టుకోలేకపోయిన బాధితురాలు అతడిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బీహార్‌లో ముజఫర్‌పూర్‌లో ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది.
ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియా ఆకర్షణలకు లోనై అనేక మంది తమ వైవాహిక జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. పక్కదార్లు పట్టిపోయి జీవితభాగస్వామితో పాటూ సంతానాన్ని కూడా ఇబ్బందులు పాలు చేస్తున్నారు. పెళ్లై, ఇద్దరు పిల్లలు కూడా ఉన్న ఓ వ్యక్తి సోషల్ మీడియాలో మరో వివాహితతో ప్రేమలో పడ్డాడు. ఆ తరువాత భార్యాపిల్లలను వదిలిపెట్టి ఆమెతో వెళ్లిపోయాడు(Married man abandons wife for Girlfriend). చివరకు, చేతిలో డబ్బు అయిపోవడంతో మళ్లీ మొదటి భార్యకు ఫోన్ చేసి డబ్బులు అడగడం కొసమెరుపు. అతడు చేసిన పనికి బంధువులు, స్నేహితులు దుమ్మెత్తిపోశారు. పెళ్లై పిల్లలు కూడా ఉండి ఇంతటి నీచానికి పాల్పడతావా అంటూ తిట్టిపోస్తున్నారు.
బీహార్‌లోని(Bihar) ముజప్ఫర్‌పూర్ జిల్లాకు చెందిన రోషన్ కుమార్‌కు ఎనిమిదేళ్ల క్రితం పెళ్లైంది. అతడికి భార్య సంతోషి దేవి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, రోషన్‌కు ఫేస్‌బుక్‌లో ఎనిమిది నెలల క్రితం ఓ వివాహితతో పరిచయమైంది. ఆ తరువాత వారిద్దరూ మరింతగా సన్నిహితమయ్యారు. ఇటీవల ఓ రోజు అతడు అకస్మాత్తుగా ఇంట్లోంచి వెళ్లిపోయాడు. భర్త ఎక్కడకు వెళ్లాడో తెలీక సంతోషీ దేవి తెగ కంగారు పడిపోయింది. చివరకు పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది.
మరోవైపు, రోషన్ తన ప్రేమికురాలితో నాలుగు రోజుల పాటు కులాసాగా గడిపాడు. అప్పటికే అతడు తన వెంట తెచ్చుకున్న డబ్బు మొత్తం అయిపోవడంతో చివరకు సంతోషి దేవికి ఫోన్ చేశాడు. జరిగిందంతా చెప్పి తనకు సాయం చేయాలని అభ్యర్థించాడు. భర్త తీరుతో తీవ్ర ఆగ్రహం చెందిన ఆమె వారున్న ఇంటికి వెళ్లి రోషన్‌పై మండిపడింది. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. రోషన్ మాత్రం ఇద్దరినీ జాగ్రత్తగా చూసుకుంటానని పోలీసులకు చెప్పాడు. దీంతో, అక్కడున్న వారందరూ అవాక్కయ్యారు. కాగా, తన జీవితం నాశనం చేసిన భర్త, అతడి గర్ల్‌ఫ్రెండ్‌పై తగిని చర్యలు తీసుకోవాలంటూ బాధితురాలు పోలీసులను అభ్యర్థించింది. చట్టం ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు సంతోషీ దేవికి హామీ ఇచ్చి పంపించారు.
Updated Date - 2023-06-16T15:40:51+05:30 IST