ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: విదేశీ వనితను చూడగానే ఆ భర్త లోకం మర్చిపోయి.. ఇదంతా భార్య గమనించడంతో..

ABN, First Publish Date - 2023-06-11T17:07:19+05:30

తెగ మురిసిపోతూ ఫొటోకు పోజులిచ్చిన వ్యక్తి.. వెనక నుంచి వచ్చి వీపు వాయించిన భార్య.. అతడి తప్పు ఇదే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: పాత అలవాట్లను వదిలించుకోవడం అంత ఈజీ కాదు. కానీ, పెళ్లి కాకముందు జల్సాగా బతికేసినట్టు పెళ్లి అయ్యాక కూడా ఉంటామంటే అస్సలు కుదరదు. మగాళ్ల విషయంలో ఈ మాట అక్షర సత్యం. పద్ధతి మార్చుకోని భర్తల వీపు విమానం మోత మోగించేందుకు భార్యలు ఎప్పుడూ రెడీగా ఉంటారు. భర్త తింగరి పని చేస్తున్నాడని తెలియగానే వాళ్ల రంగంలోకి దిగి తాట తీస్తారు. కానీ, ఈ విషయాలపై నిర్లక్ష్యం ప్రదర్శించి దెబ్బతిన్న ఓ యువకుడి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ వీడియో ఎక్కడిదో తెలీదు కానీ ఓ యువకుడు బీచ్‌లో ఓ విదేశీ వనిత పక్కన నిలబడి ఫొటోకు తెగ పోజులిచ్చాడు. బికినీ ధరించి ఉన్న ఆమె భుజంపై దర్జాగా చేయి వేసి తెగ నవ్వాడు. ఫారినర్‌తో ఫొటో దిగే క్రమంలో లోకాన్నే మర్చిపోయాడు. తెగ ఎంజాయ్ చేశాడు.

అదిగో అక్కడ భారీ పొరపాటు జరిగిపోయింది. యువకుడు తన లోకంలో లీనమైపోయి ఉన్న విషయాన్ని అతడి వెనకే ఉన్న భార్య గమనించింది. అతడు మురిసిపోతున్న వైనం చూసి ఆమెకు మండుకొచ్చింది. ఇంకేముందీ.. అందరూ చూస్తుండగానే అతడి వీపు ఆమె మందలింపుగా ఒక్కటి చరుస్తుంది.

ఈ ఘటన తాలూకు వీడియో నెట్టింట వైరల్ అయి నెటిజన్లను పడి పడి నవ్వేలా చేస్తోంది. ఇప్పటివరకూ ఈ వీడియోకు మూడు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయంటే వీడియో ఎంతగా వైరల్ అవుతోందో మీరే అర్థం చేసుకోండి. ఇక వీడియోకు ప్రతిస్పందనగా కామెంట్లు కూడా అదే స్థాయిలో వచ్చాయి. ఈ మగాళ్లు మారరు అంటూ అనేక మంది సరదా వ్యాఖ్యలు చేశారు. భార్యతో ఉన్నప్పుడు జాగ్రత్త బ్రదర్, అనుభవంతో చెబుతున్నాం అంటూ మరికొందరు వ్యాఖ్యానించారు. నెటిజన్లను యమాగా ఆకట్టుకుంటున్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

Updated Date - 2023-06-11T17:10:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising