ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐఫోన్ తెచ్చిన డెలివరీ బాయ్‌ని డబ్బుల కోసం వేచివుండమన్నాడు.... కొద్దిసేపటికి పరుగుపరుగున వచ్చి...

ABN, First Publish Date - 2023-02-21T08:03:17+05:30

ఒక యువకునికి ఐఫోన్‌పై ఉన్న మోజు ఘోర నేరానికి పాల్పడేలా చేసింది. కర్ణాటకలోని హాసన్‌లో ఐఫోన్‌ క్రేజ్‌తో ఓ యువకుడు హంతకునిగా మారాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక యువకునికి ఐఫోన్‌పై ఉన్న మోజు ఘోర నేరానికి పాల్పడేలా చేసింది. కర్ణాటకలోని హాసన్‌లో ఐఫోన్‌ క్రేజ్‌తో ఓ యువకుడు హంతకునిగా మారాడు. అతని ఘాతుకానికి బెంగళూరులోని హాసన్ ప్రాంతంలో ఒక డెలివరీ బాయ్ సజీవదహనమయ్యాడు. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన సెకండ్ హ్యాండ్ ఐఫోన్‌ను కొనుగోలు చేయడానికి డబ్బు లేకపోవడంతో ఆ యువకుడు ఈ-కామర్స్ డెలివరీ బాయ్‌ని కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 7న ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు హేమంత్ దత్ (20) ఇటీవల ఈ-కామర్స్ పోర్టల్ నుండి సెకండ్ హ్యాండ్ ఐఫోన్‌ను ఆర్డర్ చేశాడు.

డెలివరీ బాయ్ హేమంత్ నాయక్ సెకండ్ హ్యాండ్ ఐఫోన్ డెలివరీతో వచ్చాడు. హేమంత్ దత్ డెలివరీ బాయ్‌ని వేచి ఉండమని కోరాడు. డబ్బు తెచ్చేందుకు అతను మరొక గదిలోకి వెళ్ళాడు. మరుక్షణం బయటకు వచ్చి, వేచి ఉన్న డెలివరీ బాయ్‌పై హేమంత్ దత్ కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో డెలివరీ బాయ్ మృతి చెందాడు. సీసీ కెమెరాల సాయంతో పోలీసులు ఈ కేసును ఛేదించారు. నిందితుడు... డెలివరీ బాయ్ మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి పెట్రోల్‌‌తో తగులబెట్టినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తేలింది. నిందితుడు.. డెలివరీబాయ్ మృతదేహాన్ని మూడు రోజుల పాటు తన ఇంట్లో గోనె సంచిలో ఉంచినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అనంతరం నిందితుడు ఆ మృతదేహాన్ని బయటకు తీసి తగులబెట్టాడు.

Updated Date - 2023-02-21T08:03:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising