ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

tourist destination: ఆ విషయంలో కేరళకు పట్టంకట్టిన న్యూయార్క్ టైమ్స్.. వినోదం కోసం బయలుదేరుతున్న జనం!

ABN, First Publish Date - 2023-03-19T08:07:15+05:30

tourist destination: న్యూయార్క్ టైమ్స్ తెలిపిన వివరాల ప్రకారం 2023లో సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాలలో కేరళ(kerala) ఒకటి. న్యూయార్క్ టైమ్స్(New York Times) ప్రకటించిన జాబితాలో 2023లో సందర్శించాల్సిన 52 ప్రదేశాల జాబితాలో కేరళ పేరు కూడా ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

tourist destination: న్యూయార్క్ టైమ్స్ తెలిపిన వివరాల ప్రకారం 2023లో సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాలలో కేరళ(kerala) ఒకటి. న్యూయార్క్ టైమ్స్(New York Times) ప్రకటించిన జాబితాలో 2023లో సందర్శించాల్సిన 52 ప్రదేశాల జాబితాలో కేరళ పేరు కూడా ఉంది. భారతదేశం(India)లోని కేరళ సహజ ప్రాకృతిక సౌందర్యంతో ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. అయితే ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించిన రిపోర్టు(Report) ప్రపంచ పర్యాటకులను భారతదేశంలోని కేరళ వైపు ఆకర్షించేలా చేసింది. గతేడాది న్యూయార్క్ టైమ్స్ టూరిస్టుల(Tourists) కోసం 50 అత్యుత్తమ టూరిస్ట్ స్పాట్లను ఎంపిక చేసింది. వీటిలో భారతదేశంలోని కేరళ పేరు కూడా ఉంది. 2023లో పర్యాటకులు సెలవులను(Holidays) గడిపేందుకు కేరళ అత్యుత్తమ ప్రదేశం(Best place)గా న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. న్యూ యార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం కేరళ అనేక ప్రమాణాలు కలిగిన పర్యాటక కేంద్రంగా ఉంది. ఇందులో కేరళలో లభ్యమయ్యే ఆహారాలు(Foods), సముద్ర తీరాల వివరాలు పొందుపరిచారు. కేరళలో జరిగే పండుగల గొప్పదనాన్ని అభివర్ణించారు. న్యూయార్క్ టైమ్స్(New York Times) నివేదిక కేరళలోని ఓ గ్రామాన్ని కూడా ప్రస్తావించింది. ఈ గ్రామం వంబనాడ్(Vambanad) సరస్సు ఒడ్డున ఉంది. ఈ గ్రామంలో పర్యాటకులు చూడాల్సిన అంశాలను వివరించారు. కొబ్బరి నారల నుండి తాడు నేయడం, తాటి చెట్లు ఎక్కడం మొదలైనవి ఇందులో ఉన్నాయి. పర్యాటకులు(Tourists) కేరళ సందర్శనతో పాటు సంప్రదాయ థియేటర్‌ను కూడా సందర్శించవచ్చు.

Updated Date - 2023-03-19T08:19:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising