Kalyani Priyadarshan: అమెరికన్ యువతిని పెళ్లాడిన హీరోయిన్ సోదరుడు
ABN, First Publish Date - 2023-02-05T12:01:59+05:30
వెటరన్ డైరెక్టర్ ప్రియదర్శన్ (Priyadarshan) కుమారుడు, హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan) సోదరుడు సిద్దార్థ్ ప్రియదర్శన్ (Siddharth Priyadarshan) పెళ్లి ఘనంగా జరిగింది.
వెటరన్ డైరెక్టర్ ప్రియదర్శన్ (Priyadarshan) కుమారుడు, హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan) సోదరుడు సిద్దార్థ్ ప్రియదర్శన్ (Siddharth Priyadarshan) పెళ్లి ఘనంగా జరిగింది. మెర్లిన్ అనే అమెరికన్ యువతితో కలసి సిద్దార్థ్ ఏడడుగులు వేశారు. చెన్నైలో ఫిబ్రవరి 3న ఈ వేడుక జరిగినట్టు తెలుస్తోంది. ఈ వివాహనికి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మెర్లిన్ అమెరికన్ పౌరురాలు. విజువల్ ఎఫెక్ట్స్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. వైరల్‌గా మారిన ఫొటోల్లో ప్రియదర్శన్, లిజీ, కల్యాణి ప్రియదర్శన్ నూతన జంటతో కనిపించారు.
బాలీవుడ్, మాలీవుడ్‌లోని అనేక హిట్ సినిమాలకు ప్రియ దర్శన్ దర్శకత్వం వహించారు. ‘హేరా ఫేరీ’, ‘హంగామా’, ‘గరం మసాలా’, ‘బాగమ్ బాగ్’, ‘చుప్ చుప్ కే’, ‘దే దనా దన్’, ‘భూల్ భూలయ్యా’ చిత్రాలను తెరకెక్కించారు. ప్రియదర్శన్ మలయాళీ నటి లిజీని 1990లో పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఏమైందో తెలియదు కానీ ఈ జంట 2016లో విడాకులు తీసుకున్నారు. వీరి కూమార్తె కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌గా రాణిస్తున్నారు. అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ‘హలో’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ‘చిత్ర లహరి’, ‘రణ రంగం’ వంటి చిత్రాల్లోను కనిపించారు. మలయాళం నుంచి ఎక్కువగా అవకాశాలు వస్తుండటంతో అక్కడే సినిమాలు చేస్తున్నారు.
Updated Date - 2023-02-05T12:02:03+05:30 IST